బన్నీ Vs మహేష్.. మళ్లీ పోటీ తప్పదా

సంక్రాంతికి మహేష్, బన్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరు సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ వేసుకుంటే, మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్ వేసుకున్నారు. వసూళ్లలో కూడా అల వైకుంఠపురములో,…

సంక్రాంతికి మహేష్, బన్నీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరు సంక్రాంతి విన్నర్ అని పోస్టర్ వేసుకుంటే, మరొకరు రియల్ సంక్రాంతి విన్నర్ అంటూ పోస్టర్ వేసుకున్నారు. వసూళ్లలో కూడా అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల మధ్య పోస్టర్ల వార్ నడిచింది. ఈ మధ్యనే ఇది కాస్త సద్దుమణిగింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ యుద్ధం ఇప్పటితో ముగిసిపోలేదు.

సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి నిర్మాత అనీల్ సుంకర మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడు. ఈనెల 29తో ఈ సినిమా 50 రోజులు పూర్తిచేసుకుంటోంది. ఈ సందర్భంగా 50 డేస్ ఫంక్షన్ ఏర్పాటుచేయాలనేది సుంకర ప్లాన్. మహేష్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్. ఆ రోజున ఫంక్షన్ ఉన్నా, లేకున్నా ఫైనల్ కలెక్షన్ రిపోర్ట్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ నిర్మాత.

అదే కనుక జరిగితే బన్నీ యూనిట్ మరోసారి అలర్ట్ అవుతుంది. ఎందుకంటే.. ఆ మరుసటి రోజుకు అల వైకుంఠపురములో సినిమా కూడా 50 రోజులు పూర్తిచేసుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 50 డేస్ సెంటర్స్ అంటూ ప్రాంతాల వారీగా థియేటర్ల లిస్ట్ సోషల్ మీడియాలో కనిపిస్తోంది. సో.. సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి వసూళ్ల లెక్కలతో పోస్టర్ వస్తే మాత్రం, ఆ మరుసటి రోజు తమ సినిమాకు సంబంధించి కూడా ఫైనల్ కలెక్షన్ లెక్కల్ని రిలీజ్ చేయాలని బన్నీ టీం భావిస్తోంది.

ఇప్పటికే తమ సినిమా అన్ని ఏరియాస్ లో నాన్-బాహుబలి-2 రికార్డులు సృష్టించిందని ప్రకటించుకుంది అల వైకుంఠపురములో యూనిట్. ఫైనల్ కలెక్షన్ లిస్ట్ రిలీజ్ చేస్తే.. ఈ సినిమా బాహుబలి-2కు మరింత దగ్గరగా వెళ్లడం ఖాయం. అంతా బాగానే ఉంది కానీ, ఈ వసూళ్లలో ప్రామాణికత ఎంత, వాటిని ఏ మేరకు నమ్మొచ్చనేది మాత్రం ఆ దేవుడికే తెలియాలి.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'చావుకబురు చల్లగా'