గీతగోవిందం ఆ రికార్డు సాధిస్తుందా?

చిన్న సినిమాగా తయారై, పెద్ద సినిమాల రికార్డులు కూడా షేక్ చేస్తూ నాలుగోవారంలోకి అడుగుపెట్టింది గీత గోవిందం. ఇప్పుడు అసలైన రికార్డులు ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికి నైజాంలో 18.60 కోట్లు షేర్ సాధించింది మూడు…

చిన్న సినిమాగా తయారై, పెద్ద సినిమాల రికార్డులు కూడా షేక్ చేస్తూ నాలుగోవారంలోకి అడుగుపెట్టింది గీత గోవిందం. ఇప్పుడు అసలైన రికార్డులు ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికి నైజాంలో 18.60 కోట్లు షేర్ సాధించింది మూడు వారాలకు. నిన్నటి నుంచి నాలుగోవారం ప్రారంభమైంది. మరోక్క కోటి నలభైలక్షలు షేర్ సాధిస్తే, నైజాంలో ఇరవైకోట్లు సాధించిన సినిమాల జాబితాలో గీత గోవిందం ప్లేస్ సంపాదించుకుంటుంది.

ఇప్పటి ఈ లిస్ట్ లో బాహుబలి, బాహుబలి 2, రంగస్థలం, అత్తారింటికిదారేది, మగధీరం, శ్రీమంతుడు, దువ్వాడ జగన్నాధమ్ మాత్రమే వున్నాయి. ఖైదీ నెంబర్ 150 ఒక్క నలభై అయిదులక్షల దూరంలో ఆగిపోయింది. ఇప్పటికే నైజాంలో ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ ను గీతగోవిందం దాటేసింది.

ఒకవేళ మరో కోటీ నలభై లక్షల షేర్ కనుక వస్తే, నైజాంలో ఇరవైకోట్ల క్లబ్ లో చేరడమే కాదు, భరత్ అనే నేను, సరైనోడు, ఖైదీ నెంబర్ 150 సినిమాలను దాటేస్తుంది. ఇక మెగా హీరోలకు నాలుగు సినిమాలు, నాన్ మెగా హీరోలకు మూడు సినిమాలు మిగుల్తాయి నైజాం ఇరవై కోట్ల జాబితాలో.

ఇప్పుడు మెగాభిమానులకు ఇదే టెన్షన్ గా వుందట. మెగా క్యాంప్ నిర్మించిన సినిమానే మెగా హీరోల రికార్డులు తుడిచిపెడుతుండడం అంటే చిత్రమే కదా? అటు ఓవర్ సీస్ లోనూ చిరంజీవి ఖైదీ 150ని దాటే దిశగా వెళ్తోంది గీత గోవిందం.