తుపాను వస్తున్నపుడు పక్కకు తప్పుకోవడం తెలివైన లక్షణం. ఇప్పుడు విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తోంది. సినిమా ఎలా వుంటుందో అన్నది తరువాత, ముందు అయితే ఓపెనింగ్స్ కుమ్మేయడం గ్యారంటీ. ఇదంతా రాబోయే నోటా సినిమా గురించే. ఈ సినిమా విడుదలను అక్టోబర్ ఫస్ట్ వీక్ లో షెడ్యూలు చేసారు.
అయితే ఇప్పటికే ఈ శ్రీనువైట్ల-రవితేజ కాంబినేషన్ లోని అమర్ అక్బర్ ఆంధోని సినిమాను ఆ టైమ్ లోనే విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇప్పుడు నోటా సినిమా వచ్చి పడింది. దీంతో అమర్ అక్బర్ ఆంథోని నిర్మాతలు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. అనవసరంగా ఇబ్బందులు పడడం కన్నా వెనక్కు వెళ్లడం బెటర్ అనే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల అయిన తరువాత దేని సత్తా ఎంత అన్నది. కానీ ముందు ఓపెనింగ్స్ పోతాయి.
ఎందుకంటే రవితేజ-శ్రీనువైట్ల కాంబో కన్నా, విజయ్ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్స్ వుండే అవకాశం వుంది. అయితే వెనక్కు వెళ్లడానికి కూడా అమర్ అక్బర్ ఆంథోనికి సరైన డేట్స్ లేవు. వెనుక ఎన్టీఆర్-త్రివిక్రమ్ అరవింద సమేత వుంది. ఆ వెనుక వరుసగా సినిమాలు వున్నాయి.
అందుకే ఏకంగా డిసెంబర్ వరకు వాయిదా వేయాలనే ఆలోచనలో మైత్రీమూవీస్ వున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.