పరుశురామ్.. ఎందుకిలా..?

ఎంత గొప్ప క్రియేటివిటీ అయినా వుండొచ్చు. కానీ దాంతో పాటు కాస్త డిసిప్లిన్ కూడా వుండాలి. ఓ పద్దతికి కట్టుబడి వుండాలి. గీతగోవిందం సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరక్టర్ పరుశురామ్ గురించి…

ఎంత గొప్ప క్రియేటివిటీ అయినా వుండొచ్చు. కానీ దాంతో పాటు కాస్త డిసిప్లిన్ కూడా వుండాలి. ఓ పద్దతికి కట్టుబడి వుండాలి. గీతగోవిందం సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టిన డైరక్టర్ పరుశురామ్ గురించి ఇలాంటి కామెంట్ లే వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో. ఎడాపెడా అడ్వాన్స్ లు తీసుకుని, నిర్మాతలను ఇబ్బంది పెడతారన్నదే దీనికి కారణం.

గీత గోవిందం ముందు తీసుకున్న అడ్వాన్స్ లే దాదాపు మూడు నాలుగు వున్నాయట. పైగా ఆ సినిమా విడుదలకు ముందు మైత్రీ మూవీస్ దగ్గర కూడా అడ్వాన్స్ పట్టేసారట. సరే, అడ్వాన్స్ లు తీసుకోవడం తప్పుకాదు. కాని పనీకాదు. కానీ అందరికీ తరువాత సినిమా మీకే.. తరువాత సినిమా మీకే.. అని చెప్పడం మాత్రం సరికాదేమో?

మంచు ఫ్యామిలీకి ఇలాగే చెప్పారట. మైత్రీ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటూ, తరువాత మీకే పక్కా అని చెప్పారట. గీతాలో మరో సినిమా చేయాల్సి వుంది. మరి ఇలా అందరికీ చెపితే ఎలా? అదృష్టం ఏమిటంటే, ఇప్పుడు గీతగోవిందం లాభాల్లో వాటా వుండడం వల్ల పరుశురామ్ కు ఏకంగా అయిదు కోట్లకు పైగానే వచ్చిపడతాయని తెలుస్తోంది.

అందువల్ల ఎవరి అడ్వాన్స్ లు వారికి సులువుగా ఇచ్చేసి, చేతులు దులుపుకొని, నచ్చిన వారికి సినిమా చేసుకునే అవకాశం వుండడమే.