డైరెక్టర్లని ఇబ్బంది పెడుతోన్న ప్రభాస్‌!

'బాహుబలి' హేంగోవర్‌ నుంచి ప్రభాస్‌ ఇంకా బయటకి వచ్చినట్టు లేడు. హాలీవుడ్‌ స్టార్లనే తీసుకుంటే వారు చేసే భారీ బడ్జెట్‌ ఫ్రాంఛైజీ చిత్రాలతో పాటు రెగ్యులర్‌ బడ్జెట్‌ సినిమాలు కూడా సమాంతరంగా రూపొందుతూ వుంటాయ్‌.…

'బాహుబలి' హేంగోవర్‌ నుంచి ప్రభాస్‌ ఇంకా బయటకి వచ్చినట్టు లేడు. హాలీవుడ్‌ స్టార్లనే తీసుకుంటే వారు చేసే భారీ బడ్జెట్‌ ఫ్రాంఛైజీ చిత్రాలతో పాటు రెగ్యులర్‌ బడ్జెట్‌ సినిమాలు కూడా సమాంతరంగా రూపొందుతూ వుంటాయ్‌. కానీ ప్రభాస్‌ మాత్రం తాను చేసే ప్రతి సినిమా 'బాహుబలి' రేంజ్‌లో వుండాలని భావిస్తున్నాడు.

బాహుబలితో వచ్చిన నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ని కాపాడుకోవడానికి భారీ సినిమాలు చేస్తూనే వుండాలని ప్రతి చిత్రానికీ భారీ కాన్సెప్టులు, బడ్జెట్టులు పెట్టుకుంటున్నాడు. దీంతో అతనితో మంచి కమర్షియల్‌ సినిమా తీద్దామనుకున్న యువ దర్శకులపై భారం పడుతోంది. సాహో దర్శకుడు సుజిత్‌కి పెద్ద సినిమాని హ్యాండిల్‌ చేసిన అనుభవం ఏది? అతని చేతిలో నూట యాభై కోట్ల సినిమాని పెట్టేసారు.

జిల్‌ తీసిన రాధాకృష్ణకుమార్‌ కూడా ఇప్పుడు అదే రేంజ్‌ ప్రాజెక్ట్‌ తలపెడుతున్నాడు. నిజానికి ఈ యువ దర్శకులు ప్రభాస్‌తో సింపుల్‌ సినిమా తీద్దామని చూసారు. కానీ వారిని ఎంకరేజ్‌ చేసి మరీ పెద్ద సినిమాలు తీయిస్తున్నారు. ఈ ప్రాసెస్‌లో వారి ఇన్‌ఎక్స్‌పీరియన్స్‌ సదరు చిత్రాలకి ఆటంకంగా మారితే బాధ్యులు ఎవరు?