cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

పోలీస్ గా నాని?

పోలీస్ గా నాని?

హీరో నాని సినిమా సినిమాకు డిఫరెంట్ గా సబ్జెక్ట్ వుండేలా చూసుకుంటాడు. ఆ మధ్య ఒక్క కృష్ణార్జున యుద్ధం సినిమా తప్ప మరేదీ పెద్దగా నిరాశ పర్చలేదు. ప్రస్తుతం దేవదాస్ సినిమా ఫినిష్ చేసిన నాని తన తరువాత సినిమాగా జెర్సీ స్టార్ట్ చేసే అవకాశం వుంది. దాని తరువాత మైత్రీ మూవీస్ కు చంద్రశేఖర్ యేలేటి డైరక్షన్ లో ఓ సినిమా ఓకె చేసాడు.

ఈ సినిమా లైన్, కథ ఇంకా తెలియదు కానీ, ఈ సినిమాలో నాని పోలీస్ గా కనిపిస్తాడని మాత్రం తెలుస్తోంది. అయితే దర్శకుడు యేలేటి చంద్రశేఖర్ కాబట్టి, మిగిలిన హీరోలు చేసినట్లు యాంగ్రీ పోలీస్ గానో, స్ట్రిక్ట్ పోలీస్ గానో నాని కనిపించకపోవచ్చు.

యేలేటి అన్నీ కాస్త డిఫరెంట్ స్టోరీలు రాసుకుంటారు కాబట్టి, నానిని పోలీస్ గా చూపించబోతున్నారు. అంటే సమ్ థింగ్ ఏదో వుంటుంది కచ్చితంగా. మరిన్ని వివరాలు వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. జెర్సీ సినిమాలో స్పోర్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న నాని మరి కొన్ని స్క్రిప్ట్ లు ఫైనల్ చేసే పనిలో వున్నట్లు తెలుస్తోంది.