cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ తరువాత వెంకీతోనే..?

త్రివిక్రమ్ తరువాత వెంకీతోనే..?

టాలీవుడ్ టాప్ డైరక్టర్లలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తరువాత సినిమా ఎవరితో చేయబోతున్నారు. స్టయిలిష్ స్టార్ బన్నీతోనే అని వినిపిస్తూ వస్తోంది. అయితే లేటెస్ట్ సంగతి ఏమిటంటే, త్రివిక్రమ్ తరువాతి సినిమా విక్టరీ వెంకటేష్ తో అని తెలుస్తోంది. వెంకీతో తమ సినిమా అంటూ హారిక హాసిని ఎప్పుడో ప్రకటించింది. అంతేకాదు. ప్రొడక్షన్ నెంబర్ కూడా ఇచ్చేసింది.

ఇక్కడ రెండు పాయింట్లు వున్నాయి. ఒకటి హారిక హాసిని బ్యానర్ అంటే త్రివిక్రమ్ మాత్రమే దర్శకుడు. ఇప్పటి వరకు ఇదే జరుగుతూ వస్తోంది. వాస్తవానికి వెంకీతో జాలీ ఎల్ఎల్బీ రీమేక్ చేయాలన్న ప్రతిపాదన వుంది. కానీ త్రివిక్రమ్ రీమేక్ లు చేయరు. అందువల్ల హారిక హాసిని పైనే వేరే దర్శకుడితో, ఆ సినిమా చేస్తామనే ప్రతిపాదన వెంకీ దగ్గరకు వెళ్లినట్లు తెలుస్తోంది. కానీ దానికి వెంకీ వీటో చేసారని వినికిడి.

కావాలంటే అది తరువాత చేస్తా అని, ముందుగా అనుకున్న ప్రకారం త్రివిక్రమ్ తోనే చేద్దామని వెంకీ ఖరాఖండీగా చెప్పేసినట్లు తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్ సినిమా తరువాత హారిక హాసిని సినిమా వెంకీతో, త్రివిక్రమ్ కాంబినేషన్ లోనే వుంటుందని తెలుస్తోంది. ఆ తరువాత బన్నీ సినిమా చేస్తారని బోగట్టా.

వెంకీ-త్రివిక్రమ్ కాంబో సినిమా ఎప్పటి నుంచో అనుకుంటున్నది. ఇప్పటికి పక్కా కాబోతోందన్నమాట.