వెనకబడిన వైసీపీ.. చేతులు కాలాక ఆకులు

అయ్యగారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుంది వైసీపీ నాయకుల పరిస్థితి. 151 ఎమ్మెల్యేలతో భారీ విజయం తర్వాత నేతలు, కార్యకర్తలు పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. ముఖ్యమంత్రి అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సరిగా…

అయ్యగారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టుంది వైసీపీ నాయకుల పరిస్థితి. 151 ఎమ్మెల్యేలతో భారీ విజయం తర్వాత నేతలు, కార్యకర్తలు పూర్తిగా స్తబ్దుగా మారిపోయారు. ముఖ్యమంత్రి అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో విఫలమవుతున్నారు. నాయకులే కాదు, మీడియా, సోషల్ మీడియా వింగ్ లు కూడా పచ్చ ప్రచారం ముందు చేతులెత్తేస్తున్నారు.

ఇప్పటికే చాలాసార్లు ఈ విషయం రుజువైంది. తాజాగా కరెంటు చార్జీల విషయంలో మరోసారి వైసీపీ అసమర్థత బైటపడింది. రాష్ట్రంలో కరెంటు చార్జీల సవరణతో ఏ పేదవాడిపై కనీసం పది పైసల భారం కూడా పడదు, పైగా.. టారిఫ్ లో మార్పుల వల్ల చార్జీలు తగ్గుతాయి కూడా. కానీ ఈ మంచి కంటే చెడే ముందుగా లోకమంతా చేరిపోయింది. టీడీపీ అనుకూల మీడియా రచ్చతో జగన్ కరెంటు చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారనే ప్రచారం జోరందుకుంది.

ఆ తర్వాత తీరిగ్గా విజయసాయిరెడ్డితో సహా వైసీపీ నేతలు, సోషల్ మీడియా వ్యవహారాలు చూస్తున్న వారు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. చార్జీలు ఎంత పెరిగాయి, టీడీపీ ఎలా ప్రచారం చేస్తుందనే విషయంపై గ్రాఫిక్స్ రెడీ చేసి షేర్ చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చార్జీలు పెంచనని మాటిచ్చిన జగన్ మాట తప్పారంటూ చంద్రబాబు, లోకేష్ సహా అందరూ దుష్ప్రచారం జోరుగా సాగించారు. నిజంగానే టీడీపీది దుష్ప్రచారమే, మరి వైసీపీ బ్యాచ్ ఏం చేస్తోంది. కరెంటు చార్జీలు సవరించిన వెంటనే.. ప్రజలకు మేలు చేసే విషయాలను ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది.

రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగదారులు 1.45 కోట్ల మంది ఉంటే.. 500 యూనిట్ల నిబంధన వల్ల కేవలం 1.35లక్షల మందిపై భారం పడుతుంది. ఆ లక్షా 35వేలమంది పేదలా, ధనికులా? మరి ధనికులపై ధరల ప్రభావం పడుతుందా? మరి పేదవారిపై వడ్డింపు అంటూ టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్రచారం తప్పేకదా? ఈ తప్పు సమర్థంగా జనాల్లోకి వెళ్లేదాకా వైసీపీ చేతులు కట్టుకుని ఉండటం ఇక్కడ అంతకంటే పెద్ద తప్పు.

కేవలం విద్యుత్ చార్జీల పెంపులోనే కాదు.. జగన్ అధికారంలోకి వచ్చినప్పట్నుంచి వైసీపీ వర్గాలు కూల్ అయిపోయాయి. అధినేతకు అండగా నిలబడి కాపాడాల్సింది పోయి, జగన్ పై లేనిపోని విమర్శలు చేస్తుంటే చోద్యం చూస్తున్నారు.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ