క్విడ్ ప్రో కో కేసుల విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును కోరుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ విచారణను ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా వేసింది తెలంగాణ హై కోర్టు. ఈ పిటిషన్ పై సీబీఐ తన కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో వాదోపవాదాలు ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా వేసింది హై కోర్టు.
ఈ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని సీబీఐ కోర్టుకు చెప్పాలని కూడా హై కోర్టు జగన్ తరఫు న్యాయవాదికి తెలవడం విశేషం. దీని అర్థం ఏమిటో తెలియాల్సి ఉంది. హై కోర్టులో ఈ పిటిషన్ పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి హాజరీ అవసరం ఉంటుందో లేదో స్పష్టత రావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ కేసుల విచారణ మొదలై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోతున్నాయి. జగన్ ను 16 నెలల పాటు జైల్లో ఉంచారు. ఆ తర్వాత ప్రతి శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సీబీఐ వాదిస్తూ ఉంది. అదే విషయాన్ని సీబీఐ కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై హై కోర్టును ఆశ్రయించారు జగన్ మోహన్ రెడ్డి.