ఇలాంటి విచిత్ర ఐడియాలు ఎవరిస్తున్నారు?

అమరావతినుంచి రాజధాని తరలిపోతుందనే భయం.. ఆ ప్రాంతంలోని కొందరు రైతుల్లో ఉన్నమాట నిజం. కానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోవడం వలన జరిగే నష్టానికంటె ఎక్కువగా వారిని భయపెట్టి… వారి ఆందోళనల ద్వారా తమ…

అమరావతినుంచి రాజధాని తరలిపోతుందనే భయం.. ఆ ప్రాంతంలోని కొందరు రైతుల్లో ఉన్నమాట నిజం. కానీ.. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖకు తరలిపోవడం వలన జరిగే నష్టానికంటె ఎక్కువగా వారిని భయపెట్టి… వారి ఆందోళనల ద్వారా తమ స్వార్థ, సంకుచిత రాజకీయ ప్రయోజనాలు ఈడేర్చుకోవాలని ఉబలాటపడేవాళ్లు ఉన్నారన్నదీ నిజమే. తుళ్లూరులో జరుగుతున్న దీక్షలు ఇవాళ్టికి 57 వ రోజుకు చేరుకున్నాయి.

ఇంత సుదీర్ఘంగా జరుగుతున్న దీక్షల పట్ల ప్రభుత్వం దృష్టిని రాబట్టడం అనేది ఇకమీదట దుర్లభమే. ప్రభుత్వం చూసే సంగతి దేవుడెరుగు.. కనీసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉందా? అందుకు ఆందోళన కారులు ఏం చేస్తున్నారు? ఈ విషయాలు ఏమాత్రం గొప్పగా లేవు.

అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలనే వాదనకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలనుంచి ఏమాత్రం మద్దతు లేదు! 29గ్రామాలు తప్ప ఎవ్వరూ దానిని పట్టించుకోలేదు. ఆ ప్రాంత ప్రజలైనా సరే ఆర్థిక ప్రయోజనాల గురించి చింతిస్తున్నారే తప్ప.. రైతులుగా చింతిస్తున్న వారు కాదనే అభిప్రాయం ఒకటి తతిమ్మా రాష్ట్ర ప్రజలకు ఏర్పడింది. ఆందోళన చేస్తున్న వారు కొత్త పుంతలు తొక్కుతున్నారు. కొత్త అయిడియాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇలాంటి అయిడియాలు వారికి ఎవరిస్తున్నారనేదే అర్థం కావడం లేదు.

ఇటీవలి అమరావతి మహిళలు మేడారం జాతరకు తరలివెళ్లారు. సమ్మక్క సారలక్కలకు మొక్కుకున్నారు. జగన్ కు మంచి బుద్ధి పుట్టించమని వేడుకున్నారు. ఇవాళ.. అమరావతి ప్రాంత రైతులు 200మంది షిరిడీ యాత్ర పెట్టుకున్నారు. రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం మీద జై అమరావతి నినాదాలు చేసి.. షిరిడీ వెళ్లారు. శిబిరంలో దీక్షలు చేస్తున్న మహిళలు.. చేతుల మీద జై అమరావతి ఒకటే రాజధాని అని గోరింటాకు పెట్టుకుని.. ఆ డిజైన్లతో దీక్ష చేశారు.

… ఏమిటీ నిరసనలు. గోరింటాకు డిజైన్లలోకి అమరావతి వస్తే ఏమవుతుంది? రాజధాని తరలిపోతే.. షిరిడి దేవుడు చేతగానివాడు అయినట్టేనా? తాము ఆధ్యాత్మిక టూర్లు, మెహెందీ ఉత్సవాలు చేసుకోదలచుకుంటే.. వారు ఆ పనులకు ‘అమరావతి రాజధాని’ అనే ముసుగు ఎందుకు తొడుగుతున్నారు? ఈ సంగతులు బోధపడడం లేదు. ఇలాంటి గిమ్మిక్కు దీక్షల వలన అమరావతి వాసుల వాదనలకు మిగిలిన ప్రజల్లో ఉన్న సానుభూతి కూడా పోతుంది. ఆ విషయం వారు గుర్తించాలి.

ఫ్యాన్స్ తో రచ్చ చేసిన విజయ్ దేవరకొండ