చంద్రబాబు కాడి పక్కన పారేసినట్టే!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశాన్ని చాలా నర్మగర్భంగా పక్కన పెట్టేశారు.  ఏ అంశాన్ని ఎప్పుడు ఎందుకు పైకి లేపాలో..  ఎప్పుడు ఎందుకు పక్కన పారేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అనే అంశాన్ని చాలా నర్మగర్భంగా పక్కన పెట్టేశారు.  ఏ అంశాన్ని ఎప్పుడు ఎందుకు పైకి లేపాలో..  ఎప్పుడు ఎందుకు పక్కన పారేయాలో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు.  అందుకే అమరావతి నుంచి రాజధాని తరలించ లేరు… అని బీరాలు పలుకుతూ తెగ రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు దానిని నెమ్మదిగా పక్కదారి పట్టిస్తున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు 45 రోజుల పాటు సాగే తన బస్సు యాత్ర గురించి వెల్లడించారు.  ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం,  రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదని చాటి చెప్పటం,  మూడు రాజధానులు చేటు అని ప్రచారం చేయడం ఈ బస్సు యాత్ర ప్రధాన లక్ష్యం. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో కూడా ఈ బస్సు యాత్ర సాగుతుంది.  పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి లు ఎమ్మెల్యేలు జనాలని తరలించడం,  జేజేలు కొట్టించడం వంటి పనుల బాధ్యత తీసుకోవలసి ఉంటుంది.

మొన్న మొన్నటి దాకా అమరావతి గురించి రాద్ధాంతం చేయడంతో పాటు..  రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో భిక్షాటనకూడా చేసిన చంద్రబాబు,  ఇప్పుడు ఆ అంశానికి మరిన్ని జోడించారు. కియా మోటార్స్ సంస్థ తమిళనాడు కు తరలి పోతుందని ఒక పుకారు పుట్టిన వెంటనే చంద్రబాబుకు మహోత్సవం పొడుచుకు వచ్చినట్లు ఉన్నది. ఆయన రాష్ట్రవ్యాప్త యాత్రకు సిద్ధమయ్యారు.  ప్రభుత్వ వైఫల్యాలంటూ ఆయన ఏం చెప్పదలచుకున్నారో తెలియదు గానీ…  పెట్టుబడులు తరలిపోతున్నాయనే పాయింట్ కలిపారు.

ఇన్ని అంశాలు జోడించడానికి ఒక ప్రధాన కారణం ఉంది.  కేవలం రాజధాని పేరుతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో పర్యటించినప్పుడు ఆయనకు ఠికానా లేకుండా పోయింది.  ఆయన మాటలు పట్టించుకున్న దిక్కులేదు. అమరావతి మాత్రమే ఎజెండాగా పెట్టుకుంటే పార్టీ మట్టి కొట్టుకు పోతుందని ఆయనకు స్పష్టత వచ్చినట్లుంది.  అందుకే నెమ్మదిగా దాన్ని పలుచన చేస్తూ మరిన్ని అంశాలు జోడించి ఒక మొక్కుబడి యాత్రకు సిద్ధమవుతున్నారు.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు