కేంద్రాన్ని నిలదేసే ధైర్యం ఏపీకి లేదా?

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వడం తప్ప..  అభివృద్ధి పథకాలకు కేంద్రం ప్రత్యేకంగా  ఇచ్చినది ఏమీ లేదని తెలంగాణ నాయకులు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.  గత ఆరేళ్లలో తెలంగాణాకు లక్షన్నర…

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను ఇవ్వడం తప్ప..  అభివృద్ధి పథకాలకు కేంద్రం ప్రత్యేకంగా  ఇచ్చినది ఏమీ లేదని తెలంగాణ నాయకులు మోడీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు.  గత ఆరేళ్లలో తెలంగాణాకు లక్షన్నర కోట్ల రూపాయలు విడుదల చేశామని ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రకటించిన నేపథ్యంలో…  అదంతా పనుల్లో తమకు రావలసిన వాటా మాత్రమే తప్ప…  కేంద్రం అందించిన సహాయం ఎంత మాత్రం కాదని వారు ఆక్షేపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి రెవిన్యూ మిగులు లోనే ఉన్నది అనే విషయాన్ని ఒప్పుకుంటూనే…  మిషన్ భగీరథ తదితర విప్లవాత్మక పథకాలకు కేంద్రం చేయూత ఇచ్చినప్పటికీ ప్రయోజనం లేదని విమర్శిస్తున్నారు.

 ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సి ఉంది.  ఇదే పనిని ఆంధ్రప్రదేశ్ తరఫున నాయకులు చేయలేకపోతున్నారు.  కేంద్రం తమ రాష్ట్రానికి గత ఆరేళ్లలో ఇచ్చిన నిధులు..  తమ హక్కుగా రావలసిన వాటా ఎంతో…  రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఉదారంగా ఇచ్చిన సొమ్ము ఎంతో వాళ్లు లెక్కలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది.

 నిజానికి ఇప్పుడే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కంటే,  ఇలా లెక్కలు తేల్చి కేంద్రాన్ని నిలదీయ వలసిన బాధ్యత,  గత అయిదేళ్లుగా అధికారం వెలగబెట్టిన తెలుగుదేశం ఎక్కువగా ఉంది.  తెలంగాణకు సంబంధించి అదనపు నిధులు ఎందుకు ఇవ్వలేదు విషయంలో కారణాలు చెప్పిన మోడీ సర్కార్…  ఏపీ విషయంలో అదే కారణాలను రిపీట్ చేసే అవకాశం ఎంతమాత్రం లేదు.

 ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తొలి నుంచి రెవెన్యూ లోటు లోనే మునిగి ఉంది. లాభాల్లో ఉన్న రాష్ట్రం కనుక వారికి అదనంగా ఏమీ ఇవ్వడంలేదు అని చెప్పడానికి కేంద్రానికి అవకాశం లేదు.  మరి లోటు లో ఉన్న రాష్ట్రం కనుక అదనంగా వారి చేయూత ఏమీ అందిస్తున్నారో తేల్చవలసిన అవసరం కూడా ఉంటుంది. దాన్ని ఏపీ నాయకులు సరిగ్గా వాడుకుని కేంద్రాన్ని నిలదీయాలి.  అలా కాకుండా ఒకవేళ కేంద్రం అదనపు నిధులు ఇచ్చి ఉన్నప్పటికీ కూడా…  వాటిని సరైన కారణాలు దుర్వినియోగం చేసి ఉంటే మాత్రమే…  గత అయిదు ఏళ్ళు పాలించిన తెలుగుదేశం పార్టీ మౌనం వహిస్తుందని  ప్రజలు అనుకుంటున్నారు.

 కేంద్రం రాష్ట్రాలకు ఏమీ చేయడం లేదని విమర్శలు గుప్పించే బదులు…  గత ఆరేళ్ల లెక్కలను బయటకు తీస్తే సూటిగా ప్రశ్నించిన వారి  నుంచి రావలసిన దానిని రాబట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు అని పలువురు భావిస్తున్నారు.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు..