హిజ్రాల కోసం వాళ్లకు చెక్ పెడ్తారా!

బ్రిటిషు పాలకులను తరిమికొట్టి.. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం గానీ…. డెభ్బయిఅయిదేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ దాస్యలక్షణాలు మాత్రం పోవడం లేదు. కేవలం ‘ఆంగ్లో ఇండియన్’ అనే బ్రిటిషు రక్తం ప్రవహిస్తున్నందుకు గాను.. కొందరికి ప్రత్యేకంగా…

బ్రిటిషు పాలకులను తరిమికొట్టి.. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం గానీ…. డెభ్బయిఅయిదేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ దాస్యలక్షణాలు మాత్రం పోవడం లేదు. కేవలం ‘ఆంగ్లో ఇండియన్’ అనే బ్రిటిషు రక్తం ప్రవహిస్తున్నందుకు గాను.. కొందరికి ప్రత్యేకంగా పెద్ద పీటవేసి కూర్చోబెట్టి.. మనదేశంలో మన ప్రజల మంచిచెడుల గురించి మన నాయకులు చేసే నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని వారికి అందిస్తున్నాం. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ ల ప్రాతినిధ్యం ఇంకా అవసరం ఉందా? అనే చర్చ కొందకాలంగా జరుగుతున్నదే అయినప్పటికీ… తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డి.. ఒక కొత్త ప్రతిపాదనతో… ఆకోటాకు చెక్ పెడుతున్నారు.

పార్లమెంటులో థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రాతినిధ్యం ఉండాలనేది రేవంత్ తాజా డిమాండు. ఇది ఆలోచింపజేసే డిమాండు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో… అతిపెద్ద నిర్ణాయక వ్యవస్థ అయిన పార్లమెంటులో.. అసలు ఆంగ్లోఇండియన్ అనే కోటా ఎందుకు ఉండాలి. ఎలాంటి అర్హతలతోనూ నిమిత్తం లేకుండా.. ‘ఆంగ్లో..’ అనే పదంతో ముడిపడి ఉన్నారు గనుక.. వారికి చట్టసభల అవకాశం ఎందుకివ్వాలి? అనేది కీలకమే.

అదే సమయంలో రేవంత్ చెప్పినట్లుగా థర్డ్ జెండర్ – హిజ్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం గురించి కూడా ఆలోచించాల్సిందే. ఈదేశంలో హిజ్రాల పట్ల సుదీర్ఘకాలం పాటు వివక్ష కొనసాగుతూ వచ్చింది. 1994 వరకు వారికి ఎలాంటి గుర్తింపు లేకుండాపోయింది. 1994లోనే హిజ్రాలకు ఓటు హక్కు కల్పిస్తూ చట్టం వచ్చింది.

ఆ తరువాత 1998లో మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్నమ్ మౌసీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేగా 2003 వరకు పనిచేసింది. ఇదొక రికార్డు. అప్పటినుంచి దేశంలో వందలాది నియోజకవర్గాల్లో హిజ్రాలు ఎన్నికల్లో పోటీచేయడం జరుగుతూనే ఉంది. అయితే విజయం సాధించిన దాఖలాలు లేవు. వారికి అంత బలం, అనుకూలతలు కూడా ఉండవు. అలాగని.. పురుషులు మహిళలు లాగే.. చట్టాలు జరిగేప్పుడు వారి గళానికి, వాదనకు కూడా చోటివ్వడం సబబు అవుతుంది.

అయితే.. థర్డ్ జెండర్ గా ఉంటూ.. ఎన్నికల్లో నెగ్గడం కష్టసాధ్యమైన నేపథ్యంలో రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రతిపాదన ఆలోచింపజేసేలా ఉంది. ఆంగ్లో ఇండియన్ కోటాకు మంగళం పాడి అదే స్థానంలో హిజ్రాలకు అవకాశం కల్పించాలనే ఆయన డిమాండును కేంద్రం ఎలా పరిశీలిస్తుందో చూడాలి. లింగభేదం వలన హిజ్రాలు వివక్షకు గురికాకుండా ఉండాలంటే అలాంటి నిర్ణయం రావడమే మంచిది.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు