కొత్త గోల చేయడానికి సబ్జెక్టు దొరికింది

 తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త సబ్జెక్టు దొరికింది. కొన్ని నెలలు వీలైతే మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ సబ్జెక్టు మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడిపేయవచ్చు. మా ప్రాణాలకు గండం…

 తెలుగుదేశం పార్టీ నాయకులకు ఇప్పుడు కొత్త సబ్జెక్టు దొరికింది. కొన్ని నెలలు వీలైతే మరి కొన్ని సంవత్సరాల పాటు ఈ సబ్జెక్టు మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కాలం గడిపేయవచ్చు. మా ప్రాణాలకు గండం ఉన్నదంటూ… తమను అంతం చేయడానికి జగన్ కుట్ర చేస్తున్నారంటూ  కొత్త ఆరోపణలు గుర్తించవచ్చు.  ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఎగబడవచ్చు.  అవును తెలుగుదేశం పార్టీ ఇన్ని రకాలుగా ఉత్సాహంగా పని చేయడానికి వీలయ్యే విధంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  తెలుగు దేశానికి చెందిన అనేక మంది నాయకులకు భద్రత కుదించింది,  కొందరికి తొలగించింది.

 ప్రభుత్వాలు మారినప్పుడు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకుల విషయంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ప్రతిసారీ జరుగుతూ ఉండేదే.  ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇందుకు భిన్నంగా వ్యవహరించదు.  జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత,  ఆటోమేటిక్ గా మాది అయిపోయింది చంద్రబాబు నాయుడుకు భద్రతను  పోలీసులు కుదించారు.  నాకు ప్రాణ హాని తలపెడితారా అంటూ..  నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు నాయుడు ప్రజల సానుభూతి కోసం ప్లాన్ చేశారు.  ప్రజలు ఆయన వాదనను పట్టించుకోలేదు.  కోర్టుకు వెళ్లారు.  మునుపటి భద్రత అవసరం లేదని కోర్టు కూడా తేల్చింది.

 ఇప్పుడు ఆ పార్టీకి చెందిన అనేక మంది నాయకులు ప్రభుత్వం భద్రత తగ్గించింది. దేవినేని ఉమా,  జెసి దివాకర్ రెడ్డి, కాలు శ్రీనివాసులు లాంటి వారికి పూర్తిగా తొలగించగా… యనమల రామకృష్ణుడు,  పరిటాల శ్రీరామ్ లాంటి వారికి తగ్గించారు.  పరిటాల శ్రీరామ్ విషయంలో మాత్రం పోలీసులు పునరాలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలపై తెలుగుదేశం నాయకులు ఆగ్రహం అవుతున్నారు.

జెసి దివాకర్ రెడ్డి భద్రతను ఇదివరకు కుదించిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు పూర్తిగా తొలగించింది.  అయితే ఈ భద్రతల కుదింపుపై కోర్టుకు వెళతామని కాల్వ శ్రీనివాసులు హెచ్చరిస్తున్నారు.  తనకు ప్రాణ హాని తల పెట్టారంటే వైయస్సార్ కాంగ్రెస్ మీద ఆరోపణలు గుప్పిస్తూ మరి కొన్ని నెలల పాటు ఈ భద్రత కుదింపు వ్యవహారాన్ని తెలుగుదేశం మాట్లాడుతూ  గడిపేస్తుందని అర్థమవుతూనే ఉంది.  ఒకసారి నాయకుడిగా గుర్తింపు వచ్చినందుకు,  ప్రజలు తిరస్కరించిన తరువాత కూడా పోలీసు భద్రత కోరుకోవడంలో ఔచిత్యం ఏమిటో సదరు భయగ్రస్తులైన నాయకులకే తెలియాలి.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు