జగన్ బ్రహ్మాస్త్రానికి రాజముద్ర!

శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయంతో… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రత్యర్థులపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రాజముద్ర పడనుంది.  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే  ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి… మండలి రద్దు పర్వాన్ని పూర్తి చేయడం…

శాసనమండలిని రద్దు చేయాలనే నిర్ణయంతో… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ప్రత్యర్థులపై ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి రాజముద్ర పడనుంది.  ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలలోనే  ఈ బిల్లును కూడా ప్రవేశపెట్టి… మండలి రద్దు పర్వాన్ని పూర్తి చేయడం అనేది కేవలం లాంఛనమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళుతున్నారు.  ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావడం అనేది ఆయన పర్యటన ఎజెండాలోని ముఖ్యాంశం.  ప్రధానితో భేటీలో మండలి రద్దుకు రాజముద్ర వేయించడం ఒక్కటే  ఆయన ప్రధాన డిమాండ్ గా నిలవనుంది.

 ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ పనిని పూర్తి చేయాలని జగన్ అనుకుంటున్నారు.  తద్వారా రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ బిల్లు అనేది సెలెక్ట్ కమిటీ వరకు వెళ్లకుండా చూడాలని పంతం గా ఉన్నారు.  శాసనసభ ఆమోదించిన బిల్లును,  శాసన మండలి సెలెక్ట్  కమిటీకి నివేదించడం ద్వారా… ఒక వివాదానికి బీజం వేసింది.  అయితే సదరు సెలెక్ట్ కమిటీ ని ఏర్పాటు చేయకుండా,  అసలు దానిని ఏర్పాటు చేసే అధికారం చైర్మన్ కు లేదంటూ శాసనసభా కార్యదర్శి లేఖ రాయడంతో ఆ వివాదం మరింత ముదిరింది.

 దీనిపై చైర్మన్ ఎలా స్పందిస్తారో ఇంకా క్లారిటీ రాలేదు.  దీనిపై న్యాయ పరంగా కూడా పోరాడుతాం తెలుగుదేశం పార్టీ బీరాలు పలుకుతోంది.  అలాంటి చికాకులు ముదిరే లోగానే… పార్లమెంటులో కూడా ఆమోద ముద్ర వేయించడం ద్వారా.. చక్రం తిప్పాలని జగన్ ఆలోచన.

 పనిలో పనిగా మూడు రాజధానుల ఆలోచనను కూడా జగన్ ప్రధాని ఎదుట ఉంచే అవకాశం ఉంది.  ఈ ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారాన్ని అర్ధించే అవకాశం ఉంది.

హోం శాఖ ద్వారా కూడా కొంత సహకారం అవసరం అయిన నేపథ్యంలో జగన్ అమిత్ షా ను కూడా కలవనున్నారు.

 అధికారికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి…  ఎంతోకాలంగా అపరిష్కృతంగా ఉన్న విభజన చట్టంలోని అంశాలు, ప్రత్యేక హోదా అంశం వంటి వాటి గురించి కూడా జగన్ చర్చిస్తారని అంటున్నారు గానీ…  వాటికంటే శాసన మండలి రద్దు,  మూడు రాజధానులు ఏర్పాటుకు సానుకూలత సంపాదించడం  మాత్రమే ప్రధానంగా జగన్ ఢిల్లీ పర్యటన ఉండబోతోంది.

లోకేష్ ప్రెండ్ పై ఐటీ దాడులు చేస్తే మీరెందుకు