సుదీప.. సూపర్ గా..

మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు సైరా. ఈ సినిమా నిర్మాణం, ప్రచారం ఇతరత్రా వ్యవహారాల్లో అచ్చంగా బాహుబలి అడుగుజాడల్లో నడుస్తోంది. లేటెస్ట్ గా కన్నడ నటుడు కిచ్చా సుదీప బర్త్ డే…

మెగాస్టార్ చిరంజీవి లైఫ్ టైమ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు సైరా. ఈ సినిమా నిర్మాణం, ప్రచారం ఇతరత్రా వ్యవహారాల్లో అచ్చంగా బాహుబలి అడుగుజాడల్లో నడుస్తోంది. లేటెస్ట్ గా కన్నడ నటుడు కిచ్చా సుదీప బర్త్ డే సందర్భంగా అతగాడి ఫస్ట్ లుక్ ను వదిలారు. సైరా సినిమాలో సుదీప ఓ అవుకు రాజు అనే పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్ర గెటప్ నే ఇప్పుడు బయటకు వదిలారు. బాహుబలిలో కూడా సుదీప డిఫరెంట్ గెటప్ తో, డిఫరెంట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే

సైరా సినిమాలో సుదీప గెటప్ మీద కూడా బాహుబలి ప్రభావం కాస్త కనిపిస్తోంది. ఏ ప్రభావం సంగతి ఎలా వున్నా, గెటప్ అయితే బాగుంది. గోనగన్నారెడ్డిగా బన్నీ చేసినట్లు బ్లాక్ డ్రెస్, అలాగే బాహుబలిలో మాదిరిగా తలకు పాగా, ఇలా అన్నీ మిక్స్ చేసి, మాంచి గెటప్ అయితే సెట్ చేసారు. 

సైరాకు సంబంధించి ఇప్పటికే బిగ్ బి అమితాబ్ బచ్చన్, నయనతార, చిరంజీవి తదితరుల గెటప్ లు బయటకు వచ్చాయి. సుదీప గెటప్ ఇది లేటెస్ట్.