ఇంకానా, ఇది చాలా.. అంతకు మించి అనట్లు వుంది భైరవ గీత ట్రయిలర్. ఆర్జీవీ సమర్పణలో, సిద్దార్థ టి దర్శకత్వంలో రాబోతున్న భైరవ గీత సినిమా ట్రయిలర్. ఆర్ ఎక్స్ 100 సినిమా హిట్ కావడంతో దాదాపు అదే లైన్ లో సీమ బ్యాక్ డ్రాప్ తో తయారు చేసినట్లుంది. కానీ ఆర్ ఎక్స్ 100లో వున్న స్మూత్ నెస్ ఇందులో మచ్చుకు కూడా లేదు.
పైగా ఆర్జీవీ స్టయిల్ రక్తపాతం, హింస, నానా బీభత్సం నిండిపోయింది. ట్రయిలర్ చూడ్డానికే భయమేసేలా వుంది. అమ్మాయి మీద ఎక్కి కూర్చుని, నన్ను కొడతావా అంటూ చెంపలు వాయిస్తున్న సీన్ ఒక్కటి చాలు సినిమా ఎలా వుండబోతోందో చెప్పడానికి.
ట్రయిలర్ మొత్తంమీద రొమాన్స్ కన్నా హింసే నిండుగా వుంది. అలాగే సీమ ఫ్యాక్షనిజం టైపు సీన్లు మరికొన్ని. ఎన్నిసార్లు తీస్తారు.. ఎన్నిసార్లు తీస్తారు ఇలాగే. విజవల్స్ ఓకె. థనుంజయ తదితరుల నటన ఓకె. కానీ ట్రయిలర్ లో కనిపిస్తున్న రా నెస్ మాత్రమే కాస్త భయపెడుతోంది.
ఆర్ ఎక్స్ 100 హిట్ అయిన తరువాత తెలిసింది ఇది వర్మ శిష్యుడి సినిమా అని. అంతకు మించి దానిమీద వర్మ హ్యాండ్ లేదు. కానీ ఈ సినిమా నేరుగా వర్మ సమర్పిస్తున్నాడు. అంటే మొదటి నుంచీ దీని మీద ఆయన ప్రభావం వుండి వుండాలి. అప్పుడు ఇలాకాక ఇంకెలా వుంటుంది?