అన్న హరికృష్ణ అకాల మరణంతో తమ్ముడు బాలయ్య నేరుగా దిగివచ్చేసారు. పిల్లలు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో కలిసిపోయారు. మూడు రోజులు కలిసే వున్నారు. నందమూరి కుటుంబం అంతా ఒకటైపోయిన సన్నివేశాలు పక్కాగా కనిపించేసాయి. దాంతో ఇంకేముంది. ఇక గ్యాసిప్ లే గ్యాసిప్ లు.
అరవింద సమేత వీరరాఘవ అడియో ఫంక్షన్ కు బాలయ్య బాబాయ్ చీఫ్ గెస్ట్ అని. ఇంకా.. ఇంకా.. అని. కానీ నిజానికి ఫంక్షన్ కు బాలయ్య బాబు రావడం కన్నా, బయోపిక్ లోకి ఎన్టీఆర్ ను తీసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. అంతకన్నా గొప్ప సన్నివేశం మరోటి వుండదు.
నందమూరి నటులు బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్, తారక్ రామ్ నలుగురూ ఒకే సినిమాలో వుంటే ఓ మెమరబుల్ మూవీ గా వుండిపోతుంది. యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ బయోపిక్ లో ఎవరు చేస్తారు అన్నది ఇప్పటి వరకు క్లారిటీలేదు. ఒకసారి గ్రాఫిక్స్ లో కానిస్తారని, మరోసారి బాలయ్యే చేస్తారు కానీ డిజిటల్ కరెక్షన్ చేస్తారని ఇలా వార్తలు వినిపించాయి. మొదట్లో శర్వానంద్ అనుకున్నారు కానీ ఆ నిర్ణయం మారిపోయింది.
ఇప్పటికీ ఆ వ్యవహారం పెండింగ్ లో వుంది. అందువల్ల యంగ్ ఎన్టీఆర్ గా జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకుంటే సినిమా లెవెల్ ఓ లెక్కలో వుంటుంది. కచ్చితంగా రెండు వందల కోట్ల సినిమా అయిపోతుంది. బాలయ్య-క్రిష్ ఆ దిశగా ఆలోచిస్తే మంచిదేమో?