ఫిబ్రవరి 15న వైభవ్ రేఖిని పెళ్లాడింది హీరోయిన్ దియా మీర్జా. ఏప్రిల్ 1న తను గర్భం దాల్చిన విషయాన్ని బయటపెట్టింది. అంటే పెళ్లయి 2 నెలలు కూడా గడవకముందే ఆమె ప్రెగ్నెంట్ అయిందన్నమాట. ఇదే విషయంపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడిచింది.
పెళ్లికి ముందే దియా మీర్జా గర్భం దాల్చిందని, కాకపోతే కట్టుబాట్లు ప్రకారం ఆ విషయాన్ని బయటపెట్టలేదని, ఎకాఎకిన పెళ్లి చేసుకొని, నెల రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు తాపీగా ఆ విషయాన్ని బయటపెట్టిందంటూ దియాపై ట్రోలింగ్ మొదలైంది. గతంలో నేహా ధూపియా విషయంలో కూడా ఇలానే జరిగిందని, బాలీవుడ్ హీరోయిన్ల డేటింగ్ వ్యవహారాలన్నీ ఇలాగే ఉంటాయని మరికొంతమంది సెటైర్లు వేశారు.
తనపై ఇలా ఏకథాటిగా నడుస్తున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది దియా మీర్జా. తను గర్భందాల్చిన విషయంపై ఓపెన్ గా స్పందించింది. తన పెళ్లికి, గర్భానికి ఎలాంటి సంబంధం లేదని మొహమాటపడకుండా చెప్పేసింది.
“నేను, వైభవ్ కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నాం. ఆ క్రమంలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న టైమ్ లో గర్భం దాల్చిన విషయాన్ని తెలుసుకున్నాం. అయితే కొన్ని మెడికల్ కారణాల వల్ల ఆ గర్భం సురక్షితమైనదో కాదో తెలుసుకోవడం కోసం మాత్రమే ఆ విషయాన్ని దాచిపెట్టాను. అంతేతప్ప, గర్భం దాల్చినందుకు పెళ్లి చేసుకోలేదు.”
ఇలా ఓపెన్ గా స్పందించింది దియా మీర్జా. కొన్నేళ్లుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్నానని, ఇన్నాళ్లకు సంతోషంగా ఉన్నానని తెలిపింది. కేవలం మెడికల్ కారణాల వల్ల మాత్రమే ప్రెగ్మెన్సీ విషయాన్ని దాయాల్సి వచ్చిందని.. ఓ మహిళగా గర్భం దాల్చడం, పెళ్లి చేసుకోవడం లాంటి అంశాలపై నిర్ణయం తీసుకునే పూర్తి హక్కు తనకుందని తెలిపింది.