ఎస్ఈసీ ఆశ‌ల‌న్నీ…

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై హైకోర్టు సింగిల్ జ‌డ్జి బ్రేక్ వేయ‌డంతో ఎస్ఈసీ, ప్ర‌భుత్వం నిరాశకు గుర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం రెడీ అవుతోంది. ఎస్ఈసీ…

ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌పై హైకోర్టు సింగిల్ జ‌డ్జి బ్రేక్ వేయ‌డంతో ఎస్ఈసీ, ప్ర‌భుత్వం నిరాశకు గుర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో సింగిల్ జ‌డ్జి ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేసేందుకు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం రెడీ అవుతోంది. ఎస్ఈసీ ఆశ‌ల‌న్నీ డివిజ‌న్ బెంచ్‌పైన్నేపెట్టు కున్న‌ట్టుంది.

ఈ నెల 1న ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్య‌త‌లు తీసుకున్నారు. అదే రోజు ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నిక‌లు, అవ‌స‌ర‌మైతే 9న రీపోలింగ్‌, 10న కౌంటింగ్ నిర్వ‌హించాల‌ని నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డిం చారు. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేష‌న్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన హైకోర్టులో వేర్వేరుగా పిటిష‌న్లు వేశాయి. ఈ పిటిష‌న్ల‌పై సింగిల్ జ‌డ్జి విచార‌ణ చేప‌ట్టారు.

పోలింగ్‌కు నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ అమలు కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ నిబంధనలను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ఎస్ఈసీ తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వడం.. వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారని త‌మ  అభ్యంతరాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై ప్రభుత్వం, ఎస్ఈసీ తరఫు న్యాయ వాది స్పందిస్తూ సుప్రీంకోర్టు నాలుగు వారాలు అని స్పష్టంగా చెప్పలేదని వాదించారు. ఇరువైపుల వాద‌న‌లను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది.

నిజానికి నేడు హైకోర్టు బ్రేక్ వేయ‌క‌పోతే మ‌రి కొన్ని గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. నేటి సాయంత్రంతో ప‌రిష‌త్ ఎన్నిక‌ల గ‌డువు కూడా ముగిసింది. ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు బ్రేక్ ప‌డ‌డంతో ముఖ్యంగా అధికార వైసీపీ డీలా ప‌డింది.