చంక‌లు గుద్దుకుంటున్న చంద్ర‌బాబు

మ‌రో 36 గంట‌ల్లో జ‌ర‌గాల్సిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు బ్రేక్ వేయ‌డంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చంక‌లు గుద్దుకుంటున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం స‌రైందేన‌ని హైకోర్టు తాజా తీర్పుతో రుజువైంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.…

మ‌రో 36 గంట‌ల్లో జ‌ర‌గాల్సిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు హైకోర్టు బ్రేక్ వేయ‌డంతో టీడీపీ అధినేత చంద్ర‌బాబు చంక‌లు గుద్దుకుంటున్నారు. ప‌రిష‌త్ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం స‌రైందేన‌ని హైకోర్టు తాజా తీర్పుతో రుజువైంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను నిలుపుద‌ల చేసిన అనంత‌రం ఆయ‌న స్పందించారు.

ప‌రిష‌త్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను హైకోర్టు సింగిల్ జ‌డ్జి నిలిపివేయ‌డం రాజ్యాంగ విజ‌యంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. వైసీపీ ప్రభుత్వ అరాచ‌కానికి హైకోర్టు తీర్పు చెంప‌పెట్టు లాంటిద‌ని ఆయ‌న అన్నారు. 

ఎస్ఈసీ, రాష్ట్ర ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌ను నిర‌సిస్తూ ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తూ టీడీపీ తీసుకున్న నిర్ణ‌యం స‌రైందేన‌ని కోర్టు తీర్పుతో మ‌రోసారి రుజువైంద‌న్నారు.

ఇప్ప‌టికైనా కోర్టుల మార్గదర్శకాలు ధిక్కరించడం సీఎం జగన్‌ మానాలని చంద్రబాబు హితవు పలికారు. ఎస్ఈసీ చట్టప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని … రబ్బర్‌ స్టాంపుగా మారకూడదని నీతులు చెప్పారు. 

పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి ఏడాది దాటిందని.. కొత్త ఓటర్లకు అవకాశమిచ్చేలా మళ్లీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. 

అసాధ్య‌మైన‌, ఆచ‌ర‌ణ‌కు నోచుకోని అంశాల‌ను తెర‌పైకి తేవ‌డం ద్వారా చంద్ర‌బాబు త‌న నైజాన్ని మ‌రోసారి చాటుకున్నార‌ని ప్ర‌త్య‌ర్థులు దెప్పి పొడిచారు.