దిల్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్ కే సినిమా రిజల్ట్ అంచనా వేయడం రాలేదు. శ్రీనివాస కళ్యాణం సినిమా అతడికి జర్క్ ఇచ్చింది. నిన్నగాకమొన్న సినిమా రంగంలోకి ఎంటరైన ఐరా క్రియేషన్స్ కు, ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న నాగశౌర్యకు సినిమా ఫలితాన్ని అంచనా వేయడం వస్తుందంటే ఎలా నమ్మగలం. నర్తనశాల విషయంలో అదే జరిగింది.
ఈ సినిమా విడుదలకు ముందు కాస్త ఓవర్ గా మాట్లాడాడు నాగశౌర్య. సినిమా కచ్చితంగా ఆడుతుందని, నచ్చకపోతే ఎవరూ చూడొద్దని, నచ్చితే పది మందికి చెప్పి చూపించాలని నాగశౌర్య కాస్త ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు. కట్ చేస్తే నర్తనశాల సినిమా ఎవరికీ నచ్చలేదు.
కామెడీ క్లిక్ అవుతుందని, తద్వారా సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుందని నాగశౌర్య భావించి ఉండొచ్చు. కానీ ఏ కామెడీ అయితే క్లిక్ అవుతుందని భావించారో అదే కామెడీ బెడిసికొట్టింది. సినిమాకు నెగెటివ్ గా మారింది. అందుకే నర్తనశాలకు మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చేసింది.
నాగశౌర్య చెప్పినట్టు ఇప్పుడీ సినిమా చూడొద్దని పది మందికి చెప్పాలా? అలా చేస్తే అసలు నర్తనశాల సినిమా రేపట్నుంచి థియేటర్లలో ఉంటుందా? గుడ్డిలో మెల్లలా నాగశౌర్య చేసిన ఓ పని మాత్రం అతడి తల్లిదండ్రుల్ని (నిర్మాతల్ని) కాపాడింది. అదేంటంటే.. సినిమాపై అతి నమ్మకంతో రిలీజ్ తర్వాత శాటిలైట్ అమ్మాలనుకున్నారు. కానీ ఎందుకో మళ్లీ మనసు మార్చుకొని విడుదలకు ముందే శాటిలైట్ డీల్ ఫిక్స్ చేసుకున్నారు. అదొక్కటి వీళ్లను కాపాడింది.