‘ఉక్కు’ అబద్దాలు బద్దలయ్యాయి

విశాఖ ఉక్కు కేంద్రం సంస్థ. దాన్ని అమ్మినా, అమ్మకున్నా,  ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకోవాల్సిందే. రాష్ట్రం చేసేదీ లేదు చేయగలిగిందీ లేదు. కానీ విశాఖ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అధికారం తెలుగుదేశం, దాని వెనుక…

విశాఖ ఉక్కు కేంద్రం సంస్థ. దాన్ని అమ్మినా, అమ్మకున్నా,  ఏ నిర్ణయమైనా కేంద్రం తీసుకోవాల్సిందే. రాష్ట్రం చేసేదీ లేదు చేయగలిగిందీ లేదు. కానీ విశాఖ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అధికారం తెలుగుదేశం, దాని వెనుక దాగిన సామాజిక వర్గం, విశాఖ ఎక్కడ తమ గుప్పిట్లోంచి జారిపోతుందో అని జగన్ మీద బురద వేయడం ప్రారంభించాయి. 

విశాఖ ఉక్కును జగన్ నే అమ్మేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించాయి. పోస్కో ప్రతినిధులు జగన్ ను కలిసిన ఫోటోను ఇందుకు వాడుకోవడం మొదలెట్టాయి. జనసేన అధినేత పవన్ కూడా ఇదే రాగం అందుకున్నారు. ఆయన భాజపాను నిలదీయలేక, ఈ అమ్మకాన్ని వైకాపా ఖాతాలోకి వేసారు.

గతంలో విశాఖ జింక్ ను కేంద్రం ప్రయివేటు పరం చేసినపుడు చంద్రబాబు వున్న సంగతి మరిచిపోయారు. ఇలాంటి నేపథ్యంలో కేంద్రం ఈ రోజు కుండ బద్దలు కొట్టింది. ఎంపీ ఎంవివి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మల సీతారామన్ సరైన క్లారిటీ ఇచ్చేసారు. 

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదని స్పష్టం చేసారు. స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో రాష్ట్రానికి సంబంధలేదని ఆమె చెప్పారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో రాష్ట్రానికి ఎలాంటి వాటాలు లేవన్నారు. స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై జగన్‌ ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని ఆమె పేర్కొన్నారు. అవసరమైనప్పుడు మద్దతు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్టీల్ ప్లాంట్‌లో వంద శాతం పెట్టుబడులను ఉపహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

అంటే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. అంతకు మించి రాష్ట్రానికి ఏమీ లేదు. ఇది ఒక క్లారిటీ. రెండవది విశాఖ ఉక్కు అమ్మకం ఆగదు. అది కూడా నూటికి నూరుశాతం.  

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే ఏపీలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి. విశాఖలో చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణ  మావోయిస్టులు కూడా ఇప్పటికే సంఘీభావం ప్రకటించారు. ఇక్కడ ఉద్యమం ఏదారి పడుతుందో చూడాలి. 

జూ ఎన్టీఆర్ కి 1% రాజకీయ పరిజ్ఞానం ఉన్నా

ఈ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం