అరవింద్…స్పందన అందుకేనా?

అల్లు అరవింద్. టాలీవుడ్ కింగ్ పిన్స్ లో ఒకరు. మామూలుగా అయితే మీడియ పట్టించుకోదు కానీ, అరవింద్ కాబట్టి కోవిడ్ సోకింది అనే వార్తను ప్రసారం చేసింది. పైగా దర్శకుడు త్రివిక్రమ్ ఒక డోస్…

అల్లు అరవింద్. టాలీవుడ్ కింగ్ పిన్స్ లో ఒకరు. మామూలుగా అయితే మీడియ పట్టించుకోదు కానీ, అరవింద్ కాబట్టి కోవిడ్ సోకింది అనే వార్తను ప్రసారం చేసింది. పైగా దర్శకుడు త్రివిక్రమ్ ఒక డోస్ తీసుకున్నాక కొవిడ్ వచ్చిందని, అరవింద్ రెండు డోస్ లు తీసుకున్నాక కోవిడ్ వచ్చిందని వార్తలు  బయటకు వచ్చాయి. ఇది జరిగి రెండు మూడు రోజలు దాటిపోయింది. ఇప్పుడు అరవింద్ స్పందించారు. 

తనకు కరోనా వచ్చిన మాట వాస్తవమే అని, కానీ ఒక డోస్ తీసుకున్నాక వచ్చిందని, రెండు డోస్ లు తీసుకున్నాక కాదనే అర్థం వచ్చేలా క్లారిటీ ఇచ్చారు. తమ మిత్రుడు ఒకరు వ్యాక్సీన్ తీసుకోలేదని, అతని నుంచే కరోనా సోకిందనే అర్థం వచ్చేలా మాట్లాడారు. రెండో డోస్ వ్యాక్సీన్ తీసుకున్నారా? లేదా? అన్న క్లారిటీ మాత్రం విడియోలో ఇవ్వలేదు.

నిజానికి అరవింద్ రెండు డోస్ లు తీసుకున్నారనే ఇండస్ట్రీలో బలంగా వార్తలు వినిపించాయి. మరి అలా ఎందుకు వినిపించాయన్నది పెద్ద ప్రశ్న. వ్యాక్సీన్ తీసుకోని వారు తీసుకోలేదని, ఒక డోస్ తీసుకున్నవారు ఒక డోస్ నే తీసుకున్నారని వార్తలు వచ్చాయి. రెండు డోస్ లు తీసుకున్నారన్న వార్త ఒక్క అల్లుఅరవింద్ విషయంలోనే వచ్చింది. ఇండస్ట్రీలో కూడా ఇదే విషయం బలంగా వినిపిస్తోంది. అయితే అరవింద్ తీసుకున్నది ఏ వ్యాక్సీన్ అన్నది తెలియదు. కేవలం రెండు డోస్ ల అన్న విషయమే బలంగా ప్రచారంలో వుంది.

బహుశా వ్యాక్సీన్ ల మీద జనంలో నమ్మకం పోతుందనే భావనతో, వ్యాక్సినేషన్ కు అడ్డం కాకూడదనే ఆలోచనతో అరవింద్ ఈ విధంగా ప్రకటించి వుండొచ్చు. ఓ సెలబ్రిటీగా ఆయన బాధ్యత ఆయన చేసారనుకోవాలి.