నాకు కరోనా వచ్చింది కానీ.. అల్లు అరవింద్ వివరణ

తనకు కరోనా సోకిన విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ నిర్థారించారు. అయితే అంతా అనుకుంటున్నట్టు తను రెండు డోసులు తీసుకోలేదని, ఒక డోస్ మాత్రమే తీసుకున్నానని ఆయన స్పష్టంచేశారు. డోస్ తీసుకోవడం వల్లనే కరోనా…

తనకు కరోనా సోకిన విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ నిర్థారించారు. అయితే అంతా అనుకుంటున్నట్టు తను రెండు డోసులు తీసుకోలేదని, ఒక డోస్ మాత్రమే తీసుకున్నానని ఆయన స్పష్టంచేశారు. డోస్ తీసుకోవడం వల్లనే కరోనా సోకినప్పటికీ అది తనపై పెద్దగా ప్రభావం చూపించలేదంటున్నారు అరవింద్.

“నాకు కరోనా వచ్చిన మాట నిజం. కాకపోతే 2 వ్యాక్సిన్ డోస్ ల తర్వాత కూడా కరోనా వచ్చినట్టు కొందరు చెబుతున్నారు. కానీ నేను ఒక డోస్ తీసుకున్నాను. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులతో కలిసి ఊరెళ్లాను. ఊరు వెళ్లి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. 

నాకు, వేరే వ్యక్తికి 3 రోజులు ఫీవర్ కొంచెం వచ్చి తగ్గింది. మరో వ్యక్తి హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ లో చేరిన వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకోలేదు. మేమిద్దరం వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి కరోనా ప్రభావం అంత ఎక్కువగా ఉండదనడానికి మేమే నిదర్శనం. 

హాస్పిటల్ లో ఉన్న మా స్నేహితుడ్ని చూసిన తర్వాత ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. కచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరోనా నుంచి అది మనల్ని కాపాడుతుంది. వ్యాక్సిన వేసుకున్న తర్వాత కరోనా వచ్చినప్పటికీ చాలా లైట్ గా వచ్చి వెళ్లిపోతుంది. దానికి నేనే ఎగ్జాంపుల్.”

ఇలా తనకు కరోనా సోకిన విషయాన్ని, దాన్నుంచి కోలుకుంటున్న విషయాన్ని అల్లు అరవింద్ విపులంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.