సినిమా ఆడట్లేదు ‘బ్రో’.. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ

ఓ పెద్ద సినిమా వస్తుందంటే, మిగతా సినిమాలన్నీ తప్పుకుంటాయి. సదరు బడా సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుంది. మ్యాగ్జిమమ్ థియేటర్లు దానికే. అలా వచ్చిన పెద్ద సినిమా ఫ్లాప్ అని తేలితే చిన్న సినిమాలన్నీ…

ఓ పెద్ద సినిమా వస్తుందంటే, మిగతా సినిమాలన్నీ తప్పుకుంటాయి. సదరు బడా సినిమాకు సోలో రిలీజ్ దక్కుతుంది. మ్యాగ్జిమమ్ థియేటర్లు దానికే. అలా వచ్చిన పెద్ద సినిమా ఫ్లాప్ అని తేలితే చిన్న సినిమాలన్నీ ఒకేసారి క్యూ కడతాయి. తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వేయవు. ఇప్పుడు థియేటర్లలో అదే పరిస్థితి కనిపిస్తోంది.

గత వారం బ్రో సినిమా రిలీజైంది. పవన్ కల్యాణ్, సాయితేజ్ హీరోలుగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు అంతే భారీగా థియేటర్లు కేటాయించారు. ఈ సినిమా రాకతో చిన్న సినిమాలన్నీ తప్పుకున్నాయి. అలా భారీగా రిలీజైన బ్రో సినిమా రిజల్ట్ మంగళ-బుధవారాలకు తేలిపోయింది.

పవన్ ఫ్యాన్స్ మినహా సగటు ప్రేక్షకులు బ్రో సినిమాను పట్టించుకోవట్లేదు. ఈ విషయాన్ని యూనిట్ ఒప్పుకోదు, ఇటు ఫ్యాన్స్ కూడా అంగీకరించరు. కానీ ఒక విషయం మాత్రం బ్రో సినిమా రిజల్ట్ ను చెప్పకనే చెబుతోంది. అదే ఈ వీకెండ్ రిలీజ్.

ఈ వారాంతం ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాకు నైజాంలో భారీగా థియేటర్లు దక్కాయి. ఆ తర్వాత ఎల్.జి.ఎమ్ అనే సినిమాకు కూడా అదే స్థాయిలో స్క్రీన్స్ దక్కాయి. అంటే దీనర్థం బ్రో సినిమాకు థియేటర్లు తగ్గుతున్నట్టే కదా.

నిజంగా బ్రో సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయితే ఇన్ని సినిమాలు కట్టకట్టుకొని ఇలా ఒకేసారి రావు. పవన్ కల్యాణ్ నటించిన గత సినిమాల్నే తీసుకుంటే, ఎప్పుడూ ఇలా రెండో వారాంతానికే ఇన్ని సినిమాలు రిలీజ్ అయిన దాఖలాల్లేవు. మరి బ్రో సినిమాకే ఎందుకిలా జరిగింది?

ఈ వారాంతాన్ని మినహాయిస్తే, ఆ తర్వాత వీకెండ్ కు చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా వస్తోంది. సో.. అప్పుడిక బ్రో సినిమా థియేటర్లలో దాదాపు కనిపించకపోవచ్చు.