కరోనాపై తప్పుడు ప్రచారం.. వైద్యుడిపై వేటు

హైదరాబాద్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వారం రోజులుగా వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు దిగారు. పుకార్లు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ…

హైదరాబాద్ లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వారం రోజులుగా వదంతులు వ్యాపించిన విషయం తెలిసిందే. దీంతో హైదరాబాద్ వాసులు తీవ్ర భయాందోళనకు దిగారు. పుకార్లు వచ్చిన వెంటనే రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్, కరోనా కేసులు నగరంలో లేవని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారానికి కారణమైన వైద్యుడ్ని గుర్తించిన ప్రభుత్వం, ఎట్టకేలకు అతడ్ని సస్పెండ్ చేసింది.

సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో రెండు కరోనా కేసులు నమోదైనట్టు వదంతులు వ్యాప్తిచేసిన వైద్యుడ్ని విధుల నుంచి తప్పించింది ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసిన అతడ్ని డైరక్టర్ ఆఫ్ హెల్త్ కు సరెండర్ చేశారు. ఇదే వ్యవహారంలో అతడికి సహకరించిన మరో వైద్యుడ్ని తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు.

ఇప్పటివరకు కరోనా భయంలో గాంధీ హాస్పిటల్ కు వెళ్లిన అనుమానిత రోగులంతా నెగెటివ్ గా తేలారు. వాళ్లలో ఎవరికీ కరోనా లేదని వైద్యులు ప్రకటించారు. ఇప్పటివరకు కరోనా అనుమానంతో 70 మంది హాస్పిటల్ కు రాగా.. వారిలో 62 మందికి వైరస్ లేదని నిర్థారించారు. మిగతా 8 మంది రిపోర్టులు కూడా కొద్దిసేపటి కిందట వచ్చాయి. వాళ్లకు కూడా కరోనా లేదని తేలింది. దీంతో హాస్పిటల్ వర్గాలతో పాటు ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది.

ఈరోజు ఇప్పటివరకు కరోనా భయంతో ఎవరూ హాస్పిటల్ కు రాకపోవడంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఐసోలేషన్ వార్డులో అబ్జర్వేషన్ లో  ఉన్న అనుమానిత రోగుల్ని కూడా మరో వారం రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు.

ఈ వేసవి లో పెళ్లి చేసుకోబోతున్న దిల్ రాజు