వేళ్లు కుళ్లిపోతే చెట్టును నరికేయాల్సిందే. వ్రణం పెద్దదయినపుడు శస్త్ర చికిత్స తప్పదు. మన దేశంలో అవినీతి పరిస్థితి కూడా ఇలాంటిదే. వటవృక్షంలా వేళ్లూనుకునుకుపోయింది. శస్త్రచికిత్సకు లొంగనంత ముదిరిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు దేవా కట్టా తయారు చేసిన సబ్జెక్ట్ 'రిపబ్లిక్'. సోలో బతుకే వంటి యూత్ ఫుల్ సినిమా, ప్రతి రోజూ పండగే సినిమా లాంటి ఫ్యామిలీ మూవీ తరువాత సాయి తేజ్ చేస్తున్న సినిమా.
ప్రస్థానం సినిమాను ఓ పొలిటికల్ బయోపిక్ మాదిరిగా తీసిన దేవా కట్టా మరోసారి పొలిటికల్ కరెప్షన్ ను తెరమీదకు తీసుకువస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు విడుదల చేసిన టీజర్ క్లారిటీ ఇచ్చేసింది.
నాలుగు వ్యవస్థల్లో మూడు వ్యవస్థను మిగిలిన వ్యవస్థ కంట్రోల్ చేస్తే ఫరవాలేదు. కానీ కంట్రోల్ లోకి తీసుకుంటేనే అనర్థం. ఆ పాయింట్ నే అన్యాపదేశంగా చెప్పారు టీజర్ లో.
ఎప్పుడయితే ఒక వ్యవస్థ అవినీతి మయమై, ఆ వ్యవస్థ మిగిలిన మూడు వ్యవస్థలను తన కంట్రోల్ లోకి తీసుకుంటే అనివార్యంగా మిగిలిన వ్యవస్థలు కూడా అవినీతి మయం కావాల్సిందేగా..అదే రిపబ్లిక్ టీజర్ లో కనిపించింది.