సెకెండ్ వేవ్ లో కరోనా మరో మారు దేశంలో విజృంభిస్తోంది. గత 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కు దాటింది. ఈ ఏడాదిలో ఒకేరోజు లక్షకు పైగా కేసులు నమోదు అవడం ఇదే తొలిసారి. సెంకడ్ వేవ్ ప్రభావం ముఖ్యంగా మహరాష్ట్రను కుదిపేస్తోంది. రోజువారీ కరోనా కేసుల్లో మహరాష్ట్ర లోనే అత్యధికం నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో నమోదైన లక్షకు పైగా కేసుల్లో 50 శాతానికి పై వాటా మహారాష్ట్రదే! మహారాష్ట్రలో ఒకే రోజులో 50 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మిగతా దేశమంతా కలిపి 50 వేలకు పైగా కేసులు రాగా, ఆ ఒక్క రాష్ట్రంలోనే ఆ స్థాయికి సమానంగా కేసులు నమోదు కావడం గమనార్హం.
ప్రజల, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల సెంకడ్ వేవ్ లో కరోనా ఇంతగా విజృంభించడానికి ప్రాథమిక కారణం అని చెప్పవచ్చు. ఇప్పటికే వ్యాక్సినేషన్ పక్రియ మెదలు పెట్టినా, ప్రజల్లో ఉన్న అనుమానాలను తొలగించి ఆ పక్రియను వేగవంతం చేయడంలో ప్రభుత్వలు వెనుకబడే ఉన్నాయి.
ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. పెళ్లిళ్లు, పండగలు, ర్యాలీలపై అంక్షలు అమలు చేసిన కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
కరోనా కట్టడికి స్వీయ నియంత్రణ, మాస్కులు ధరించడంతో పాటు వ్యాక్సిన్ పక్రియ వేగవంతం అయితే ఫలితం ఉండవచ్చు. దీనికి ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం కూడా చాలా ఆవసరంలా కనిపిస్తోంది.