అ..ఆ…అడుగుజాడలో ఆ పాట

చూస్తుంటే దర్శకుడు వెంకీ కుడుముల రకరకాల హిట్ లైన్ లను తీసుకుని భీష్మ పాటలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు పాటలు జనాల్లోకి వెళ్లిపోయాయి. అందులో సందేహం లేదు. ఈ రెండింటిలో…

చూస్తుంటే దర్శకుడు వెంకీ కుడుముల రకరకాల హిట్ లైన్ లను తీసుకుని భీష్మ పాటలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన రెండు పాటలు జనాల్లోకి వెళ్లిపోయాయి. అందులో సందేహం లేదు. ఈ రెండింటిలో 'వాటే వాటే వాటె బ్యూటీ' పాటపై ఇస్మార్ట్ శంకర్ లో పాటల ప్రభావం వున్నట్లు అనిపించింది.

ఇప్పుడు రెండో పాట వచ్చింది. 'సరాసరి గుండెల్లో దించావె' అనే హుక్ లైన్ తో వున్న ఈ పాట చిత్రీకరణ చూస్తుంటే అ..ఆ సినిమాలో పాట గుర్తుకోస్తోంది. అయితే పాటతో పాటు ఇచ్చిన విజువల్స్ కొన్నే. అవే రిపీటెడ్ గా వేసారు. వీటిలో కూడా హీరో హీరోయిన్లతో సమానంగా డైరక్టర్ వెంకీ కుడుమల విజువల్స్ కూడా వున్నాయి. 

ఏమైతేనేం ఈ పాట కూడా రాను రాను జనాల్లోకి వెళ్లేలాగే వుంది. శ్రీమణి రాసిన సాహిత్యం బాగానే వుంది. స్వరసాగర్ ట్యూన్ కూడా బాగానే వుంది. మొత్తం మీద ఒక్కోపాట వస్తూ భీష్మ సినిమా మీద అంచనాలు పెంచుతోంది.

14 రోజుల్లోనే ఉరి శిక్ష‌