కన్నతల్లి కూతుర్ని అత్యాచారం చేయించిన దారుణం బెంగళూరులో బయటపడింది. ఈ మేరకు తన కన్న తల్లిపై కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఆ మైనర్ బాలిక ఇప్పుడు గర్భవతి.
కొన్నాళ్ల కిందట భర్తతో విడిపోయిన తల్లి తన 14 ఏళ్ల కూతురితో కలిసి ఒంటరిగా ఉంటోంది. ఇదే అదనుగా ఆమెకు దగ్గరయ్యాడు ఆటోడ్రైవర్ వినయ్. తల్లికి మద్యం అలవాటు చేశాడు. ఇద్దరూ కలిసి బెంగళూరు సౌత్ లోకి శివార్లకు వెళ్లి మందు కొట్టేవారు. మద్యానికి బానిసైన తల్లి, తన కూతురితో కాపురం చేసుకోమని వినయ్ కు పర్మిషన్ ఇచ్చింది.
రోజూ వచ్చి వినయ్ తన పక్కన పడుకుంటే ఆ 14 ఏళ్ల చిన్నారికి అర్థం కాలేదు. అమ్మ చెప్పడంతో సరేనంది. అలా ఆ మైనర్ బాలికపై 4 నెలల పాటు అత్యాచారం చేశాడు వినయ్. ఫలితంగా ఆమె గర్భవతి అయింది. విషయం తెలిసినా తల్లి తనకు ఏమీ పట్టనట్టు ఊరుకుంది. దీంతో స్వయంగా బాలిక, తన అమ్మమ్మ సహాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
మగాడి సబ్-డివిజన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆ బాలిక 8 నెలల గర్భవతి. అయితే బాలిక పోలీస్ కంప్లయింట్ ఇచ్చే టైమ్ కే వినయ్ జైలు పాలయ్యాడు. ఓ దొంగతనం కేసులో అతడు అరెస్టయ్యాడు. ప్రస్తుతం బాలిక తల్లి కోసం పోలీసులు వెదుకుతున్నారు.