అభిమానులు, కార్యకర్తలపై చేయి చేసుకోవడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారింది. పెద్ద మనిషిగా పేరొంది, అందరి గౌరవాన్ని చూరగొన్న కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఈ రోజు దురుసుగా ప్రవర్తించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
అనంతపురం జిల్లా హిందూపురంలో అభిమానిపై ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ చేయి చేసుకోవడం విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించిన బాలకృష్ణ ఉదంతాన్ని మరిచిపోకుండానే, ఈ దఫా మహిళా దినోత్సవం నాడు ఓ మహిళపై అశోక్ గజపతి రాజు దాడి చేయడం ప్రత్యర్థులకు ఆయుధాన్ని ఇచ్చినట్టైంది.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అశోక్ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచారం చేపట్టారు. ప్రచారానికి వచ్చిన మహిళపై అశోక్ గజపతి రాజు అకారణంగా చేయి చేసుకున్నారు. తన అభిమాన నేత అశోక్‌పై అభిమానంతో పువ్వులు జల్లుతుండగా.. సహనం కోల్పోయిన అశోక్ గజపతిరాజు విచక్షణ కోల్పోయి ప్రవర్తించారు. సదరు మహిళా కార్యకర్త మెడలు వంచి చితక బాదారు.
పది మందిలో తనపై మాజీ మంత్రి దాడి చేయడం అవమానంగా భావించిన మహిళా కార్యకర్త మౌనంగా రోదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అశోక్ గజపతి రాజు ప్రవర్తనకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఆశ్చర్యపోయారు.
ఎన్నికల ముంగిట టీడీపీ నేతల చేష్టలు పార్టీకి నష్టం తెస్తాయనే ఆందోళన మున్సిపల్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మహిళా కార్యకర్తపై అశోక్ గజపతి రాజు దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
It’s said Former Union Minister and TDP Leader @Ashok_Gajapathi beaten a a woman activist during poll campaign in Vijayanagaram on international women’s day pic.twitter.com/FUVJeSfoYz
— Lokesh journo (@Lokeshpaila) March 8, 2021