‘చల్లగా’ చెప్పబోయే పాయింట్ ఏమిటి?

కార్తికేయ-లావణ్య త్రిపాఠీలతో బన్నీవాస్ నిర్మించిన సినిమా చావు కబురు చల్లగా…ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చి ఓ విషయం మీద క్లారిటీ ఇచ్చేసాయి.  Advertisement హీరో భర్త చనిపోయిన అమ్మాయిని, అది…

కార్తికేయ-లావణ్య త్రిపాఠీలతో బన్నీవాస్ నిర్మించిన సినిమా చావు కబురు చల్లగా…ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ఇప్పటికే బయటకు వచ్చి ఓ విషయం మీద క్లారిటీ ఇచ్చేసాయి. 

హీరో భర్త చనిపోయిన అమ్మాయిని, అది కూడా చావు ఇంట్లో చూసి ప్రేమిస్తాడు. ఆపై వెంటపడతాడు. ఇది కాస్త కొత్తగా వుంది అని అంతా అనుకుంటున్నరు. అయితే సినిమాలో ఇంతకు మించిన అన్ కన్వెన్షనల్ పాయింట్లు వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

తొలిసారిగా ప్రేక్షకుల సెంటిమెంట్ ను కాకుండా, వైవిధ్యాన్ని ఆదరిస్తారనే ఆలోచనతో గీతా ఓ కొత్త తరహా కథను తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో కార్తికేయ పాత్రతో పాటు, హీరో తల్లి ఆమని పాత్ర కూడా కీలకంగా వుంటుందని తెలుస్తోంది. 

ఇటీవలే ఉప్పెనలో ఓ షాకింగ్ పాయింట్ ను కథలో చేర్చారు. జనం చూసారు. చావు కబురు చల్లగాలో కూడా కొన్ని షాకింగ్ పాయింట్లు వున్నాయని తెలుస్తోంది. సినిమా కథలు ఇలాగే వుండాలి, పాత్రలు ఇలాగే ఆలోచించాలి అనే రోటీన్ థాట్ ప్రాసెస్ కు విభిన్నంగా ఈ కథ వుంటుందని బోగట్టా.

ఈ సినిమా నా జీవితంలో ఒక ఆణిముత్యం

దమ్ముంటే మోదీని ప్రశ్నించు..