నాగ్ చైతన్య – చందు మొండేటి – బన్నీవాస్ – గీతా కాంబినేషన్ లో ఓ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమా ప్లానింగ్ లో వుంది. ఈ సినిమా కథ ఇదే అంటూ కొన్ని గ్యాసిప్ లు కూడా వున్నాయి.
ఓ ప్రేమికుడు చేపల వేటకు వెళ్లి, సముద్రంలో తుపానుకు తప్పిపోయి పాకిస్థాన్ కు వెళ్లిపోతాడు అనే లైన్ ఎక్కువగా వినిపించింది. ఇప్పుడు అదే నిజం అనేలా వుంది యూనిట్ చేస్తున్న పని చూస్తుంటే.
నిర్మాత బన్నీవాస్, దర్శకుడు చందు, హీరో చైతన్య ముగ్గురూ కలిసి ఈ రోజు శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశం గ్రామానికి వెళ్లారు. అక్కడి మత్స్యకారులతో మాట్లాడారు. ఆ గ్రామంలో ఇలాగే గతంలో కొందరు తుపానుకు దారి తప్పి వేరే దేశాలకు వెళ్లినవారు వున్నారు. వారితో మాట్లాడి విషయాలు అన్నీ తెలుసుకున్నారు.
హీరో చైతన్య ఈ శుక్రవారం బయల్దేరి, మత్స్యకారులతో కలిసి చేపలవేటకు సముద్రంలోకి వెళ్తారు. సముద్రంపై వారి జీవన విధానాలు ప్రత్యక్షంగా తెలుసుకుంటారు.
ఇదంతా సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పబ్లిసిటీగా ఉపయోగడ పడే వరకు బాగానే వుంటుంది. కానీ ఇప్పటికే బయటకు వినిపిస్తున్న కథ నిజమే అని జనాలకు చెప్పేస్తోందీ వ్యవహారం. కథ అంతకు మించి వుంటే ఓకె. లేదంటే కథ మీద కిక్కు పోయే ప్రమాదం వుంది.