వన్ మినిట్.. వన్ డైలాగ్.. వన్ మ్యాన్ లుక్.. సైరా

టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీల్లో ఒకటి మెగాస్టార్ సైరా.  ఈ సినిమా టీజర్ మరో కొద్దిగంటల్లో బయటకు రాబోతోంది. ఎలా వుంటుంది అన్న ఆసక్తి మెగాభిమానుల్లో వుంది. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి…

టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీల్లో ఒకటి మెగాస్టార్ సైరా.  ఈ సినిమా టీజర్ మరో కొద్దిగంటల్లో బయటకు రాబోతోంది. ఎలా వుంటుంది అన్న ఆసక్తి మెగాభిమానుల్లో వుంది. వాస్తవానికి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిగా చిరంజీవి గెటప్ ఇప్పటికే బయటకు వచ్చేసింది. అమితాబ్ బచ్చన్ షేర్ చేసిన పిక్స్ ఆ లుక్ ను రివీల్ చేసేసాయి. అయినా కూడా సైరా టీజర్ ఎలా వుంటుంది అన్న ఆసక్తి అయితే వుంది.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సైరా టీజర్ నిడివి 60సెకెండ్ల వరకు వుండబోతోంది. ఈ టీజర్ లో కేవలం మెగాస్టార్ చిరంజీవి లుక్ మాత్రమే రివీల్ అవుతుంది. అది కూడా టీజర్ చివరన. ముందు అంతా బ్రిటిష్ జనాలు, ఇతరత్రా వ్యవహారాల మీదుగా కోట మీదకు ఫోకస్ చేసి, దానిపై వున్న ఉయ్యాలవాడ మీదకు ఫోకస్ అవుతుంది. అప్పుడు ఒకే డైలాగ్ తో టీజర్ ఎండ్ అవుతుంది.

సైరా సినిమా విడుదల వచ్చే ఏడాది సమ్మర్ తరువాత. అయితే ఇప్పుడు మెగా బర్త్ డే సందర్భంగా సమ్ థింగ్ చేయాలని ఈ టీజర్ చేసారు తప్ప వేరుకాదు. అందుకే దీన్ని టీజర్ అనేకన్నా ఫస్ట్ లుక్ ను ఇలా ఇచ్చారని అనుకోవాలి. ఏమైనా ఈ లుక్ సోషల్ నెట్ వర్క్ లో ఎంత సందడి చేస్తుందో చూడాలి.