శైలజారెడ్డి విడుదల వుంటుందా?

శైలజారెడ్డి అల్లుడు సినిమా అంతా స్మూత్ గా జరిగిపోయింది. విడుదలకు బోలెడు టైమ్ కూడా దొరికింది అనుకున్నారు అంతా. కానీ అంతలోనే దురదృష్టం వెక్కిరించింది. రెండు కారణాలతో సినిమా విడుదల డైలామాలో పడిపోయింది. Advertisement…

శైలజారెడ్డి అల్లుడు సినిమా అంతా స్మూత్ గా జరిగిపోయింది. విడుదలకు బోలెడు టైమ్ కూడా దొరికింది అనుకున్నారు అంతా. కానీ అంతలోనే దురదృష్టం వెక్కిరించింది. రెండు కారణాలతో సినిమా విడుదల డైలామాలో పడిపోయింది.

ఫస్ట్ గీతగోవిందం రూపంలో అడ్డంకి వచ్చింది. దాని విడుదల ప్లానింగ్ లో కాస్త హడావుడి కావడంతో, ఆ సినిమా రీరికార్డింగ్ ఆలస్యం అయింది. దాంతో శైలజారెడ్డి అల్లుడు డేట్లలో సంగీత దర్శకుడు గోపీసుందర్ ఆ వర్క్ చేసుకున్నారు. రెండు సినిమాలకు ఆయనే మ్యూజిక్ డైరక్టర్ కావడంతో వచ్చింది సమస్య.

ఆ సినిమా వర్క్ కాగానే ఈ సినిమా వర్క్ స్టార్ట్ చేసారు, కానీ రెండు రోజులకే కేరళకు వర్షాలు పట్టుకున్నాయి. వరదలుగా మారిపోయాయి. మొత్తం వర్క్ డిస్ట్రబ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే ఇంకా ఆరేడు రీళ్ల రీరికార్డింగ్ వుండిపోయింది.

కిం కర్తవ్యమ్?
ఇప్పుడు సినిమా వాయిదా వేస్తే, ఓ సమస్య కాదు. ఇలాంటి డేట్ మళ్లీ దొరకదు. మారుతి ముచ్చటపడి, పెట్టించుకున్న ముహూర్తం. పైగా వెనక్కు వెళ్లడానికి కూడా డేట్ లులేవు. 7న నాలుగు సినిమాల విడుదల వుంది. వేసుకుంటే గీత గోవిందం మాదిరిగా తెగించి 5నో 6నో వేసుకోవాలి. కానీ అది రిస్క్ తో కూడిన వ్యవహారం. తేడావస్తే శనివారానికే సినిమా తేడా చేస్తుంది. హిట్ అయితే ఓకె.

అదీకాక వెనక్కు వెళ్తే ఇప్పుడు గీతగోవిందం జోరు చూసో, నర్తనశాల పబ్లిసిటీ చూసో వెనక్కు వెళ్లారు అంటారు. కిందామీదా పడి ఇక్కడ రీరికార్డింగ్ చేయిద్దాం అంటే గోపీసుందర్ వచ్చే పరిస్థితిలో లేరు. ఇక లోకల్ గా మారుతి తన ఆస్థాన విద్వాంసుడు జేబి తోనో, లేదా మొహమాట పెట్టి థమన్ తోనో చేయించాలి. కానీ అంత టైమ్ వుందా? అన్నది సమస్య.

ఏ విషయం ఈరోజు తేలిపోయే అవకాశం వుంది. నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ కీలకపాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, పృధ్వీలు ఫుల్ లెంగ్త్ ఫన్ పండించారు. ఇప్పటికే టీజర్, మూడు పాటలు బయటకు వచ్చాయి.

ఇదిలా వుంటే శైలజారెడ్డి అల్లుడు విడుదల వాయిదాపడితే, నాగశౌర్య నర్తనశాలకు సోలో డేట్ దక్కుతుంది. అది నిజంగా అదృష్టమే. కానీ 7న విడుదల కావాల్సిన సంపత్ నంది పేపర్ బాయ్ ఓవారం ముందుకు జరిగే అవకాశం కూడా వుంది.