టాలీవుడ్ లో పరిస్థితి ఏమిటంటే, డైరక్టర్ల కోసం హీరోలు వెదుకుతుంటారు. హీరోల కోసం డైరక్టర్లు వెదుకుతుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ల చూపు వేరే వారి మీద వుంటుంది. వాళ్ల చూపు వేరే వారి మీద వుంటుంది. దాంతో మ్యాచింగ్ లు అంత వేగిన సెట్ కావు. ఇలా మ్యాచింగ్ లు సెట్ కాకే కాస్త మంచి హిట్ లు ఇచ్చిన డైరక్టర్లు కూడా ఖాళీగా వుంటారు. అదే టైమ్ లో హిట్ ఇచ్చిన డైరక్టర్ కంటపడితే, హీరోలు అభినందించి, పలకరించి లైన్లో పెట్టుకుందామని చూస్తుంటారు.
ఇప్పుడు లేటెస్ట్ గా సక్సెస్ కొట్టింది డైరక్టర్ పరుశురామ్. అతగాడు ఇప్పటి వరకు రిటర్న్ గ్యారంటీ సినిమాలే చేసాడు కానీ పెద్ద డైరక్టర్ అయితే కాలేకపోయాడు. ఇప్పుడు ఈ సక్సెస్ తో మిడిల్ రేంజ్ హీరోల కళ్లు పరుశురామ్ మీదకు మళ్లాయి. ఇప్పటికే అతగాడితో సినిమా చేయాలని మంచువిష్ణు అడ్వాన్స్ ఇచ్చారు. ఇది గీతగోవిందం సక్సెస్ కు ముందే. ఇప్పుడు లేటెస్ట్ గా ఆఫర్ లెటర్ ఇచ్చిన హీరోల్లో చైతన్య, సాయిధరమ్ ల పేర్లు వినిపిస్తున్నాయి.
గీతాఆర్ట్స్ మాత్రం వరుణ్ తేజ్ తో సినిమా చేయమంటోంది. వరుణ్ తో ఇప్పటి వరకు గీతాఆర్ట్స్ సినిమా చేయలేదు. ఆ లోటు తీర్చేయాలని చూస్తోంది. అంటే మొత్తంమీద నలుగురు హీరోలు దాదాపు పరుశురామ్ కోసం రెడీగా వున్నట్లే. చకచకా స్క్రిప్ట్ లు రెడీ చేసుకుంటే ఉపయోగం వుంటుంది.