26 మ్యూట్స్..ఎ సర్టిఫికెట్

పలాస అనే సినిమా త్వరలో విడుదల కాబోతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నేపథ్యంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా తీసిన కథ. అగ్రవర్ణ ఆధిపత్యం, బలహీనుల బాదలు వగైరా అంశాలున్నాయి సినిమాలో. ఈ…

పలాస అనే సినిమా త్వరలో విడుదల కాబోతోంది. శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణం నేపథ్యంలో నిజంగా జరిగిన కథ ఆధారంగా తీసిన కథ. అగ్రవర్ణ ఆధిపత్యం, బలహీనుల బాదలు వగైరా అంశాలున్నాయి సినిమాలో. ఈ సినిమా సెన్సారు ముందుకు వచ్చింది. ఎ సర్టిఫికెట్ ఇస్తూ దాదాపు 26 మ్యూట్ కట్ లు చెప్పినట్లు తెలుస్తోంది.

దీనికి కారణం మరేం లేదు. సినిమాలో తిట్లు, బూతులు విరివిగా వాడడం. అందుకే ఆ బూతులు, తిట్లు అన్నీ మ్యూట్ చేయమని సెన్సారు అధికారులు కోరినట్లు తెలుస్తోంది. పలాస సినిమాకు ఇటీవల వరుసగా ప్రివ్యూలు వేస్తూ వస్తున్నారు. వారానికి మూడు సార్లు ఎవరో ఒకరు చూస్తూనే వున్నారు. దీంతో ఆ సినిమా విషయాలు బయటకు వస్తూనే వున్నాయి.

ముఖ్యంగా సినిమా అంతా బాగా వుంది. కానీ క్లయిమాక్స్ లో శ్రీకాకుళంలోని ఓ వ్యాపార అగ్రవర్ణం  వ్యక్తులను విలన్లుగా చూపించారని దానివల్ల ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టాక్ వినిపిస్తోంది. గతంలో లండన్ బాబులు సినిమాతో హీరోగా  పరిచయం అయిన రక్షిత్  (విజయవాడ స్వీట్ మ్యాజిక్ కుర్రాడు) పలాస సినిమాలో హీరొగా చేసాడు. 

రఘుకుంచె సంగీతం అందించారు. ఒకటి రెండు పాటలు ఇప్పటికే పాపులర్ అయ్యాయి. నేపథ్య సంగీతం బాగుందని టాక్ వినిపిస్తోంది. గీతా సంస్థ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీకి తీసుకుంది.