ఢిల్లీ ఎన్నికలపై మోడీ రామబాణం!

మోడీ అమ్ముల పొదిలో చాలా విలువైన బ్రహ్మాస్త్రాలు చాలా ఉంటాయి. వాటిని ఆయన సరైన టైమింగ్‌తో కాస్తయినా వృథా పోకుండా ప్రయోగిస్తూ ఉంటారు. ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం దగ్గరపడిన తరుణంలో ఆయన రామబాణం…

మోడీ అమ్ముల పొదిలో చాలా విలువైన బ్రహ్మాస్త్రాలు చాలా ఉంటాయి. వాటిని ఆయన సరైన టైమింగ్‌తో కాస్తయినా వృథా పోకుండా ప్రయోగిస్తూ ఉంటారు. ఢిల్లీ ఎన్నికలకు పోలింగ్ ముహూర్తం దగ్గరపడిన తరుణంలో ఆయన రామబాణం ప్రయోగించారు. అయోధ్య రామాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వం చొరవతీసుకుంటున్న బిల్డప్ ఇచ్చారు. సుప్రీం కోర్టు చెప్పినట్టుగా ఒక ట్రస్ట్ ను ఏర్పాటుచేశారు. అదే సమయంలో మసీదు గురించి కోర్టు చెప్పిన మాటలను మాత్రం విస్మరించారు. ‘చేస్తాం’ అనే మాటతో సరిపెట్టారు.

సీనియర్ న్యాయవాది పరాశరన్ నేతృత్వంలో అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఒక ట్రస్టు ఏర్పాటు అయింది. ఇందులో 15 మంది సభ్యులుంటారు. పరాశరన్ ఇల్లే కార్యాలయంగా ఈ ట్రస్టు పనిచేస్తుంది. ఈ ట్రస్టు ఏర్పాటు గురించి ప్రధాని మోడీ ఏకంగా లోక్ సభలోనే ప్రకటించారు. ఈ ట్రస్టుకు ఉత్తరప్రదేశ్ లోని ఆదిత్యనాధ్ ప్రభుత్వం 67 ఎకరాల భూమిని లాంఛనంగా అప్పగించింది. రామాలయ నిర్మాణానికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటుచేయడానికి సుప్రీం విధించిన గడువు ఈనెల 9న పూర్తవుతుంది.

రామాలయం విషయంలో అది తమ ఓటు బ్యాంకు గనుక, ఢిల్లీ ఎన్నికలు పొంచి ఉన్నాయి గనుక.. మోడీ సర్కారు చురుగ్గానే నిర్ణయాలు తీసుకున్నది గానీ.. అదే తీర్పులో ఉన్నట్లుగా మసీదు నిర్మాణం కోసం వారికి ఐదు ఎకరాల స్థలం అప్పగించడంలో ఇంకా తాత్సారం చేస్తోంది. వారికోసం అయోధ్యలో వేర్వేరు స్థలాలను ఎంపికచేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ.. ఇప్పటిదాకా వారికి అప్పగింత మాత్రం పూర్తి కాలేదు.

ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ ను ఉగ్రవాది అనడం ద్వారా.. ఎన్నికల ప్రచారంలో ఒక వేడి పుట్టించిన భాజపా.. ఇప్పుడు రామాలయ నిర్మాణానికి పూనిక వహించి ట్రస్ట్ ఏర్పాటు చేయడం ద్వారా ఢిల్లీ ఎన్నికల్లో తమకు బీభత్సమైన ఎడ్వాంటేజీ ఉంటుందని ఆశపడుతోంది.

జగన్ గారితో సినిమా వాళ్ల ర్యాపొ తక్కువ