విశాఖ అభివ్రుధ్ధి గురించి ఇపుడు గుండెలు బాదుకుంటున్న చంద్రబాబు తన హయాంలో ఏమీ చేయలేదనే అంతా చెబుతారు. విశాఖను ఆయన బాగానే వాడుకున్నారు కానీ ఈ నగరానికి రాజధాని హోదాని మాత్రం ఇవ్వడానికి మనసు రాలేదని అంటారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు పెట్టి వైజాగ్ ని బాబు బాగానే ఉపయోగించుకున్నారు.
విశాఖలో హుదూద్ తుఫాన్ని తానే ఆపానని నాడు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు అదే హుదూద్ తుఫాన్ని నేడు అడ్డం పెట్టుకుని రాజధాని అక్కడ వద్దంటారు. ఇక హుదూద్ తరువాత విశాఖను అద్భుతంగా తీర్చిదిద్దానని చెప్ప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి ఏ మాత్రం నిధులు కేటాయించారో చెప్పాలని మేధావులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
విశాఖలో హుదూద్ తుఫాన్ తరువాత పచ్చదనం మొత్తం పోయింది. దాంతో కోటి మొక్కలు నాటే కార్యక్రమం పేరిట టీడీపీ తమ్ముళ్ళు, నాటి అధికార పెద్దలు భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారని ఆరోపణలు ఉన్నాయి. చూస్తే ఎక్కడా ఒక్క మొక్క మొలవలేదు, కానే పైసలు అలా ఖర్ఛు అయిపోయాయి. ఇదేనేమో హుదూద్ తరువాత అభివ్రుద్ధి అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
నిజంగా విశాఖ తన సహజసిధ్ధమైన అందాలతో మళ్ళీ పచ్చదనం సంతరించుకుంది తప్ప, లేని మొక్కలు నాటామని చూపించడం వల్ల కానే కాదని అందరూ అంటారు.
ఇక విశాఖను టూరిజం స్పాట్ గా అభివ్రుధ్ధి చేస్తానని పదే పదే బాబు ఊదరగొడితే ఏమో అనుకున్న జనానికి బీచ్ లో బికినీ అందాలు చూడమంటూ బాబు గొప్ప్ సీన్ క్రియేట్ చేశారు. విదేశాల్లోలాగ విశాఖ బీచ్ లో బికినీ అందాల ప్రదర్శన చేయాలనుకుంటే మహిళా సంఘాలు తిరగబడడంతో చివరి నిముషంలో దాన్ని రద్దు చేసుకున్నారు.
ఇక విశాఖకు చంద్రబాబు ఇచ్చిన బిరుదులు ఇన్నీ అన్నీ కావు, కల్చరల్ క్యాపిటల్, సినీ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఐటీ క్యాపిటల్ ఇలా ఎన్నో రకాలుగా వచ్చిన ప్రతీ సారీ జనాన్ని ఉబ్బించి పోయిన టీడీపీ పెద్దలు చివరిని ఏమీ కాకుండా చేశారని జనం ఏడ్చారంటే బాధ నిజమే కదా.
ఇపుడు విశాఖకు అసలైన క్యాపిటల్ వస్తోంది. దాన్ని మోకాలడ్డైనా ఆపుదామని బాబు అండ్ కో తెగ ప్రయత్నం చేస్తోంది. విశాఖను నేను ఎంతో అభివ్రుధ్ధి చేశానంటూ బాబు చెబుతున్న మాటలు ఇపుడు వెగటు పుట్టిస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.
అందుకే విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు విశాఖ బీచ్ లో బికీనీ కల్చర్ డెవలప్ చేసే విజన్ మీది, వెనకబడిన ప్రాంతాల అభివ్రుధ్ధి వైసీపీ సర్కార్ టార్గెట్ అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చేశారు.