ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అన్నది అందరికీ తెలిసిందే. నిర్మాత దిల్ రాజు-డైరక్టర్ అనిల్ రావిపూడి ఎఫ్ 3 తీయాలని డిసైడ్ అయిపోయారు. వరుణ్ తేజ్, వెంకటేష్ ఇద్దరు వుంటారు. మరో హీరో కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జూన్ నుంచి మొదలు పెట్టేయలన్నది ఆలోచనగా వుంది. కానీ ఇక్కడ చిన్న సమస్య వచ్చినట్లు తెలుస్తోంది.
వరుణ్ తేజ్, వెంకటేష్ ఇద్దరూ ప్రాజెక్టుకు ఓకె అనేసారు. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం ఈ సినిమాకు చాలా భారీ రెమ్యూనిరేషన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎప్పుడూ తీసుకునేదానికి దాదాపు డబుల్ ఫిగర్ ను వెంకీ కోట్ చేసినట్లు తెలుస్తోంది. మరో పక్క రెమ్యూనిరేషన్ వదిలేసి, సినిమాలో భాగస్వామ్యంఅనే ఆలోచనను కూడా వెంకీ సోదరుడు సురేష్ బాబు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
దీంతో నిర్మాత దిల్ రాజు డిస్కషన్లు సాగిస్తున్నట్లు బోగట్టా. ఈ రెమ్యూనిరేషన్ అడ్డంకి తీరిపోతే, అప్పుడు ఈ సినిమా వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. అలాగే వెంకీ, వరుణ్ లకు తోడుగా మరో టాప్ హీరో కావాలి. అది ఎవరు అనేది తేలాలి. ఎవరు కాదనకుండా చేస్తారు, పైగా క్రేజ్ వున్న హీరో కావాలి. దానిపై కూడా డిస్కషన్లు సాగుతున్నాయి.
వెంకీతో రెమ్యూనిరేషన్ సమస్య తేలిపోతే, అప్పుడు మూడో హీరో ఎవరు అన్న వ్యవహారం స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది.