కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంటరయ్యాకా సినిమాలు చేయనని ప్రకటించేశాడు. ఇక కమల్ మ్యాజిక్‌ను తెరపై చూడలేమని, బహుశా ఇది ఆఖరి చిత్రమేమో అని చాలామంది ప్రేక్షకులు ‘విశ్వరూపం 2’ని చూడటానికి క్యూలు కట్టారు. అందులోనూ ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయి ఉండటంతో రెండో పార్టుపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ అంచనాలను అందుకోవడంలో.. అభిమానులను అలరించడంలో కమల్ ఫెయిల్ అయ్యాడు. దర్శకుడిగా కమల్ ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
అయినప్పటికీ విశ్వరూపం 2కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తమిళనాట అయితే సోమవారానికే ఈ సినిమా ఇరవైకోట్ల రూపాయల వసూళ్లను సాధించిందట. ఈ లెక్కప్రకారం విశ్వరూపం 2 మంచి కలెక్షన్లతో సాగుతున్నాట్టే. అయితే ఈ ఊపు కొనసాగుతుందనే నమ్మకం మాత్రంలేదు. అంతలా డివైట్ టాక్ తెచ్చుకుంది కమల్ సినిమా.
ఈ సినిమా హిందీ వెర్షన్ విషయంలో అయితే డిస్ట్రిబ్యూటర్లు చేతులు ఎత్తేశారు. భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి విశ్వరూపం 2 హిందీ డిష్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు తెచ్చుకున్నారని సమాచారం. ఇక తమిళంలో మంచి కలక్షన్లే వచ్చినా.. ఇక్కడా డిస్ట్రిబ్యూటర్లకు తడిసి పోపెడయ్యింది. భారీ ధరకే ఈ సినిమాను అప్పగించారు. వారికి ఏ స్థాయిలో రికవర్ అవుతుందో చూడాల్సి ఉంది.