ఈ పాట ఏమిటి ‘అనూ బేబీ’?

మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా మారుతి సినిమాల్లో పాటలు బాగానే వుంటాయి. అస్సలు పాటలు సరిగ్గా ఇవ్వలేకపోతున్న థమన్ చేత, మహానుభావుడు సినిమాలో సూపర్ సాంగ్స్ చేయించుకున్నాడు. గోపీసుందర్ మంచి మ్యూజిక్ డైరక్టర్. అందులో సందేహం…

మ్యూజిక్ డైరక్టర్ ఎవరైనా మారుతి సినిమాల్లో పాటలు బాగానే వుంటాయి. అస్సలు పాటలు సరిగ్గా ఇవ్వలేకపోతున్న థమన్ చేత, మహానుభావుడు సినిమాలో సూపర్ సాంగ్స్ చేయించుకున్నాడు. గోపీసుందర్ మంచి మ్యూజిక్ డైరక్టర్. అందులో సందేహం లేదు. కానీ తెలుగు సాంగ్స్ లో హిట్ ల శాతం తక్కువ. అలాంటి హిట్ ల్లో భలే భలే మగాడివోయ్ పాటలు కచ్చితంగా వుంటాయి.

అందుకే శైలజారెడ్డి అల్లుడు సినిమా సాంగ్స్ వస్తున్నాయి అంటే కాస్త ఆశ. మళ్లీ మంచి పాటలు వుంటాయని. కానీ ఫస్ట్ సాంగ్ మాత్రం నిరాశపర్చిందనే చెప్పాలి. అనుబేబీ.. సరే అను బేబీ అంటూ విడుదలైన ఈ ట్యూన్ ను మారుతి ఎలా ఓకె చేసారో మరి. ట్యూన్ లోపలకు వెళ్లేసరికి పాత వాసన గుప్పుమని కొడుతోంది. లీడ్ ట్యూన్ కాకుండా, పాటలో వినిపించే మరో రెండు ఇంటర్ లూడ్ ట్యూన్ లు పక్కా పాత వాసనే. 

అయితే సాంగ్ పిక్చరైజేషన్ గ్రాండియర్ గా వుంది. చైతన్య హుషారుగా డ్యాన్స్ చేసాడు. అసలే చికాగ్గా మొహం పెట్టే అను ఇమ్మాన్యుయేల్, పాట సిట్యువేషన్ ప్రకారం మరింత చికాగ్గా ఎక్స్ ప్రెషన్ ఇచ్చేసింది. మిగిలిన పాటలు కూడా వస్తాయి. అవి ఎలా వుంటాయో చూడాలి.