Advertisement


Home > Movies - Movie Gossip
సాక్ష్యం దెబ్బ: బెల్లంకొండకు భారీగా కాస్ట్ కటింగ్

ఆర్భాటంగా విడుదల చేసిన సాక్ష్యం సినిమా సైలెంట్ గా సైడ్ అయిపోయింది. కంటెంట్ పరంగా సినిమా వీక్ గా ఉండడంతో పాటు ఆ వెంటనే వచ్చిన గూఢచారి సినిమా హిట్ అవ్వడంతో సాక్ష్యం చూసేందుకు ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ప్రమోషన్ తో కలిపి 42కోట్ల రూపాయల ఖర్చుతో విడుదల చేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇప్పుడీ సినిమా ఎఫెక్ట్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అప్ కమింగ్ మూవీస్ పై కూడా పడింది.

సాక్ష్యం సినిమాతో బెల్లంకొండ మార్కెట్ ఏంటో అందరికీ తెలిసింది. జయజానకి నాయక సినిమా వరకు ఇతడి మార్కెట్ ను ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే హిట్ డైరక్టర్, క్రేజీ హీరోయిన్స్ తో నెట్టుకొచ్చాడు. కానీ సాక్ష్యం సినిమాలో ఆ మేజిక్ రిపీట్ కాలేదు. అతడి అసలు మార్కెట్ ఏంటో అందరికీ తెలిసొచ్చింది.

అందుకే తేజతో బెల్లంకొండ చేస్తున్న సినిమాకు బడ్జెట్ లో కోతపడింది. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ ఉన్నప్పటికీ ఈ సినిమా బడ్జెట్ ను దాదాపు 30శాతం మేర కట్ చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడితో బెల్లంకొండ చేస్తున్న సినిమాకు కూడా భారీగా బడ్జెట్ లో కోతపెట్టారు. అసలే కొత్త దర్శకుడు కావడంతో ఆచితూచి డబ్బులు తీస్తున్నారు. 

సో.. రాబోయే సినిమాలతో బెల్లంకొండకు అసలైన పరీక్ష ఎదురుకాబోతోందన్నమాట. అతడి మార్కెట్ ఎంతనేది ఇప్పుడు అతడి చేతుల్లోనే ఉంది.