ఆమె కోరిక.. అలా తీర్చుకుంది

యూట్యూబ్ లో అడల్ట్ కంటెంట్ ఫాలో అయ్యేవారికి స్వాతినాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హాట్ హాట్ పోజులు, కవ్వించే ఎక్స్ ప్రెషన్స్, మత్తెక్కించే డైలాగ్స్ తో ఒకప్పుడు యూట్యూబ్ ను ఓ ఊపుఊపేసింది…

యూట్యూబ్ లో అడల్ట్ కంటెంట్ ఫాలో అయ్యేవారికి స్వాతినాయుడు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హాట్ హాట్ పోజులు, కవ్వించే ఎక్స్ ప్రెషన్స్, మత్తెక్కించే డైలాగ్స్ తో ఒకప్పుడు యూట్యూబ్ ను ఓ ఊపుఊపేసింది ఈమె. అయితే వెండితెరపై ఓ వెలుగు వెలగాలనే ఆమె కోరిక మాత్రం అలానే మిగిలిపోయింది.

నిజానికి స్వాతి నాయుడుకు వెండితెర కొత్తకాదు. ఎన్నో సి-గ్రేడ్ సినిమాల్లో ఆమె నటించింది. కానీ ఏదీ ఆమెకు కలిసిరాలేదు. షకీలా టైపులో పాపులర్ అయిపోదామనుకున్న స్వాతినాయుడు ఆశలు నెరవేరలేదు. పైగా అవకాశాలు కూడా తగ్గిపోవడంతో అప్పుడు యూట్యూబ్ బాటపట్టింది. 

ఇప్పుడు యూట్యూబ్ లో కూడా ఆమె అందాల్ని చూసేవాళ్లు తగ్గిపోయారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అనుకోని అవకాశం స్వాతినాయుడ్ని వరించింది. ఓ సినిమా ఆఫర్ వచ్చిందామెకు. ఓ నిర్మాత 'ఆమె కోరిక' అనే టైటిల్ తో స్వాతినాయుడు లీడ్ రోల్ లో  సినిమా చేశాడు. 

ఇది ఎలాంటి సినిమానో టైటిల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ సినిమాతో స్వాతినాయుడుకు ఓ బిరుదు కూడా కట్టబెట్టారు సదరు మేకర్స్. టైటిల్స్ లో యూట్యూబ్ స్పైసీ స్టార్ స్వాతినాయుడు అని గ్రాండ్ గా చూపించబోతున్నారు. మళ్లీ సినిమాల్లోకి రావాలన్న ఆమె ఆశ ఈ మూవీతో తీరింది. కాకపోతే వెండితెరపై ఓ వెలుగు వెలగాలన్న ఆమె కోరిక ఈ సినిమాతోనైనా తీరుతుందో లేదో?