ఇదిగో బన్నీ.. అదిగో డైరక్టర్

రాను రాను హీరో బన్నీతో ముడిపెడుతున్న డైరక్టర్ల జాబితా వింటూంటే భలే ఫన్నీగా వుంటోంది. దీనికితోడు ఏ పుట్టలో ఏ పాము వుందో అన్న చందంగా కాస్త ప్రామిసింగ్ గా కనిపించిన ప్రతి డైరక్టర్…

రాను రాను హీరో బన్నీతో ముడిపెడుతున్న డైరక్టర్ల జాబితా వింటూంటే భలే ఫన్నీగా వుంటోంది. దీనికితోడు ఏ పుట్టలో ఏ పాము వుందో అన్న చందంగా కాస్త ప్రామిసింగ్ గా కనిపించిన ప్రతి డైరక్టర్ కు ఓ ఆఫర్ పడేస్తున్నారు. బై మిస్టేక్ ఏదన్నా మంచి పాయింట్ ఎవరి దగ్గర అన్నా దొరక్కపోతుందా అని కిందామీదా అవుతున్నారు.

పాపం, బన్నీకి ఒక్కడికే ఇంతలా డైరక్టర్ల సమస్య రావడం ఏమిటో? ఎప్పుడో 2020 సినిమాల కోసం కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు డైరక్టర్లు రెడీగా వున్నారు. మెగాస్టార్ చిరంజీవిదీ అదే పరిస్థితి. మహేష్ బాబుకు రెడీ. కానీ బన్నీకి ఒక్కరు అంటే ఒక్కరు పెద్ద డైరక్టర్ పేరు కనీసం 2020 నాటికి కూడా వినిపించకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. 

ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే దర్శకులు మారుతి, చందుమొండేటి, సంపత్ నంది, యువి ఆనంద్ పేర్లు జాబితాలో వుండేవి. కానీ యువి ఆనంద్ పేరు కొన్నాళ్ల నుంచి వినిపించడం మానేసింది. లేటెస్ట్ గా పరుశురామ్ పేరు కూడా చేరింది. గీతాలో ఎవరు సినిమా చేస్తుంటే వాళ్లందరికీ ఆఫర్ రెడీగా వుంటుంది. బన్నీకి కథ వుంటే చెప్పమన్న మాట రెడీగా వినిపిస్తుంది.

త్రివిక్రమ్ మినహా మరే పేరు ఇప్పుడు బన్నీకి చాయిస్ గా వినిపించడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. ఇలా ప్రతి చిన్న, మీడియం డైరక్టర్లకు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారో. దానివల్ల సాధిస్తున్నదేమిటో తెలియదు. అనసవరంగా డైరక్టర్ల కోసం బన్నీ కిందామీదా అవుతున్నారన్న టాక్ జనంలోకి వెళ్లడం తప్పించి.