మహేష్-త్రివిక్రమ్ ను వదిలేసినట్లేనా?

ఎన్టీఆర్-త్రివిక్రమ్, మహేష్-త్రివిక్రమ్ ఈ రెండు కాంబినేషన్లు కాస్త గట్టిగా వినిపించేవి. ఖలేజా సినిమాతో త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా ఆ రోజుల్లో యావరేజ్ అయినా, ఇప్పటికీ జనం మాత్రం ఆ సినిమాను భలే…

ఎన్టీఆర్-త్రివిక్రమ్, మహేష్-త్రివిక్రమ్ ఈ రెండు కాంబినేషన్లు కాస్త గట్టిగా వినిపించేవి. ఖలేజా సినిమాతో త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ సెట్ అయింది. సినిమా ఆ రోజుల్లో యావరేజ్ అయినా, ఇప్పటికీ జనం మాత్రం ఆ సినిమాను భలే ఇష్టపడతారు. అలాంటి ఫన్ మళ్లీ ఇటు త్రివిక్రమ్, అటు మహేష్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. 

అందుకే మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు వుంటుందా? అన్నది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ నే. అయితే ఎప్పుడు అయితే హారిక హాసిని ఇచ్చిన అడ్వాన్స్ ను అడిగి మరీ మహేష్ దగ్గర నుంచి వెనక్కు తీసుకుందో, అప్పటి నుంచి ఆ కాంబినేషన్ ఇక సెట్ కాదనే వినిపిస్తోంది. ఎందుకంటే త్రివిక్రమ్ ఆ బ్యానర్ కే వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. వాస్తవానికి ఆయన మైత్రీ మూవీస్ కు ఓ సినిమా చేయాల్సి వుంది కూడా. 

అయినా కూడా మైత్రీ మూవీస్-సుకమార్ తో మహేష్ సినిమా ఫిక్స్ చేసుకుంది కానీ త్రివిక్రమ్ తో కాదు. త్రివిక్రమ్ కూడా ఎన్టీఆర్ సినిమా తరువాత బన్నీతో వెళ్తున్నఛాయలు కనిపిస్తున్నాయి కానీ మహేష్ తో కాదు. గతంలో మహేష్ కమర్షియల్ ప్రకటనలు చాలా వాటికి త్రివిక్రమ్ నే పనిచేసారు. వాటిలో అభిబస్ కమర్షియల్ కూడా ఒకటి.

కానీ లేటెస్ట్ గా అభిబస్ కమర్షియల్ కు కొరటాల శివ పనిచేసారు. ఇదంతా చూస్తుంటే, ఇక మహేష్-త్రివిక్రమ్ లింక్ తెగిపోయినట్లే కనిపిస్తోంది. మహేష్ లైనప్ కూడా సుకుమార్, సురేందర్ రెడ్డి, బోయపాటి ఇలా వుంది. కావాలంటే అప్పటికి మళ్లీ కొరటాల శివ రెడీ. సో, ఇక త్రివిక్రమ్-మహేష్ సినిమాను మరిచిపోవడమేనేమో?