నితిన్ అంటే ఇప్పుడు కేరాఫ్ దిల్ రాజు. ఎందుకంటే ఛల్ మోహన్ రంగ టైమ్ లోనే నితిన్ తండ్రి సుధాకర రెడ్డి చాలాకాలం తరువాత దిల్ రాజు ఆఫీసుకు వచ్చారు. ఛల్ మోహన్ రంగ విడుదలకు దిల్ రాజు సాయం తీసుకోవడంతో పాటు, కొడుకు నితిన్ కు మంచి సినిమా అందించే బాధ్యత కూడా అప్పగించారు. దిల్ రాజు ఆయన సాయం ఆయన చేసారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు.
కట్ చేస్తే, ఇచ్చినమాట ప్రకారం శ్రీనివాస కళ్యాణం సినిమా చేసారు. ఇప్పుడు దీనికి చాలా ప్రామిసింగ్ బజ్ వుంది. నితిన్ ఇప్పుడు వున్న పరిస్థితికి ఈ సినిమా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. తీసుకోలేదని ఒకవైపు, తీసుకోకపోవడం కాదు, ఇవ్వలేదని మరోవైపు వినిపించడం విశేషం.
ఛల్ మోహన్ రంగ లెక్కలు వున్నాయని, వాటి సెటిల్ మెంట్లు పోను మిగిలినది పెద్దగా లేకపోవడంతో రెమ్యూనిరేషన్ రాలేదని టాక్ వినిపిస్తోంది. నితిన్ కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని, తనకు ఓ మంచి సినిమా ఇస్తున్నారు అదిచాలు అని అనుకుంటున్నారని వినిపిస్తోంది.
సాధారణంగా విడుదలకు ముందు టాలీవుడ్ లో సినిమాలకు పూర్తిగా పాజిటివ్ టాక్ రాదు. కొందరు బాగుందని తెలుస్తోందంటారు. కొందరు బాలేదని టాక్ చెబుతుంటారు. కానీ శ్రీనివాస కళ్యాణం సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ వుండడం ఆశ్చర్యమే