భారీ సినిమాలు, భారీ కాంబినేషన్లు అంటే అలాగే వుంటాయి. కొడితే జాక్ పాట్. లేదూ అంటే లేదు. వందల కోట్ల పెట్టుబడి, అంతకు అంతా లాభాలు. హారిక హాసిని సంస్థ మరోసారి ఇలాంటి జాక్ పాట్ కొట్టబోతోంది. అజ్ఞాతవాసి సినిమాతో మాంచి జాక్ పాట్ కొట్టింది. కానీ కొంచెం వెనక్కు ఇచ్చుకుని, ఇలాంటి సంస్థ లేదు అనిపించుకుంది. అందుకే ఆ సంస్థ నుంచి వస్తున్న క్రేజీ కాంబినేషన్ సినిమా అరవింద సమేత వీరరాఘవ థియేటర్ హక్కులు, ఎంత కోట్ చేస్తే, అంతకు అమ్ముడుపోతున్నాయి.
ఇక నాన్ థియేటర్ హక్కులు కూడా భయంకరంగా వచ్చేలా కనిపిస్తున్నాయి. జీ టీవీతో శాటిలైట్ బేరాలు సాగుతున్నాయి. ఇరవై రెండుకోట్ల దగ్గర జీటీవీ ఆగింది. 24కోట్ల దగ్గర హారిక హాసిని సంస్థ ఆగింది. మధ్యలో డీల్ ఇంకా సెటిల్ కావాల్సి వుంది. సెటిల్ కాలేదు ఇంకా. మరో ఏడెనిమిది రోజుల వరకు అయ్యే పరిస్థితి కూడాలేదు. ఇంక హిందీ డబ్బింగ్ రైట్స్ 22కోట్ల వరకు కోట్ చేస్తున్నారు. దాని బేరాలు సాగుతున్నాయి. డిజిటల్ రైట్స్ మరో అయిదు కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
అంటే దాదాపు 50కోట్లు నాన్ థియేటర్ హక్కుల రూపంలో రాబోతున్నాయన్నమాట. ఇవికాక కనిపించని ఇన్ హవుస్ బ్రాండింగ్, స్పాన్సర్ లు లాంటి అదనపు ఆదాయాలు కూడా వుంటాయి. పైగా వీటితో ఒక సదుపాయం వుంది. సినిమా హిట్టూ.. ఫట్టూ..తో సంబంధం లేదు. వన్స్ డీల్ సెటిల్ అయిపోతే ఫిక్స్. వెనుకకు ఇవ్వడాలు, అలాంటివి వుండవు. అరవింద సమేత నిర్మాణ వ్యయం దగ్గర దగ్గర 100కోట్లు అవుతుందని బోగట్టా. అలా చూసుకున్నా, పాతిక ముఫైకోట్ల లాభం సులువుగా వుంటుంది. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ అలాంటిది మరి.