బయోపిక్ లో వాళ్లెవరు వుండరా?

రానా-క్రిష్-బాలయ్య వెళ్లి నేరుగా చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ బయోపిక్ గురించి డిస్కషన్ చేసిన వార్తలు ఫొటోలు బయటకు రావడంతో ఆ సినిమా సీన్ మారింది. ఎన్టీఆర్ బయోపిక్ స్టోరీ మొత్తం చంద్రబాబు కనుసన్నలలో నడుస్తోందన్న…

రానా-క్రిష్-బాలయ్య వెళ్లి నేరుగా చంద్రబాబును కలిసి ఎన్టీఆర్ బయోపిక్ గురించి డిస్కషన్ చేసిన వార్తలు ఫొటోలు బయటకు రావడంతో ఆ సినిమా సీన్ మారింది. ఎన్టీఆర్ బయోపిక్ స్టోరీ మొత్తం చంద్రబాబు కనుసన్నలలో నడుస్తోందన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్లింది. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం సినిమా రంగం మీద. దాంతో సమస్యలేదు. అదంతా మహానటి ఇన్స్పిరేషన్ తో అదే మాదిరిగా సినిమా సీన్లు, లైఫ్ సీన్లు పడుగు పేక మాదిరిగా చూపిస్తూ తొలిసగం అయిపోతుంది.

కానీ సమస్య అంతా మలి సగంతోనే. ఇక్కడే రాష్ట్ర రాజకీయాలు, రాజకీయవేత్తలు, ఇతరత్రా వ్యవహారాలు వుంటాయి. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం టైమ్ లో కీలకంగా వ్యవహరించిన వారు ఎవ్వరూ కూడా తరువాత లేరు. వారందరినీ చంద్రబాబు చాలా స్మూత్ గా సాగనంపేసారు అని విమర్శలు వున్నాయి. ఎన్టీఆర్ కు జాతీయ రాజకీయాలకు మధ్య వారథిగా వున్న ఉపేంద్ర, ఎన్టీఆర్ కు హిందీ పాఠాలు నేర్పిన యార్లగడ్డ, చంద్రబాబు రాకముందు ఎన్టీఆర్ కు అన్నీ తానై వ్యవహరించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఇంకా మరి కొందరు వున్నారు.

ఇప్పుడు  ఈ పాత్రల్లో ఒక్క దగ్గుబాటి పాత్ర మినహా మిగిలినవి అన్నీ గాయబ్ అవుతాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమాలో చైతన్యయాత్ర కీలకంగా వుంటుంది. ఆ యాత్రలో హరికృష్ణ కష్టం కూడా కీలకమే. కొన్నివేల కిలోమీటర్లు అవిశ్రాంతంగా వ్యాన్ నడపడం అంటే తమాషా కాదు. తిండి తిప్పలు, సరైన దుస్తులు కూడా చూసుకోకుండా హరికృష్ణ వ్య వహరించారు. ఇప్పుడు ఈ విషయాలపై కూడా అంతగా కేకెమెరా ఫోకస్ వుండదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ రాజకీయ సన్నివేశాల షూట్ వ్యవహారాల మీదనే చంద్రబాబు సలహాలు సూచనలు అందాయని టాక్ వినిపిస్తోంది. సినిమా వస్తే కానీ తెలియదు, సెన్సారు ఏ మేరకు అయిందో? ఎందుకుంటే సెన్సారు అయినా కాకపోయినా, 1983 -85 కాలంలో ఏం జరిగిందో? ఆ తరువాత ఏం జరిగిందో ఆంధ్ర జనాలకు బాగా తెలిసిన విషయాలే. అందువల్ల వాటికోసం వారు బయోపిక్ లో వెదుక్కోవడం కామన్.